Breaking News

ఫేస్ బుక్ లో పవన్ కళ్యాణ్

ఫేస్ బుక్ లో పవన్ కళ్యాణ్ 

IMG-20181030-WA0145 IMG-20181030-WA0143 IMG-20181030-WA0137 IMG-20181030-WA0138 IMG-20181030-WA0139 IMG-20181030-WA0140 IMG-20181030-WA0141 IMG-20181030-WA0142
* నవంబర్ 2 న విజయవాడ నుంచి తుని వరకూ రైలు ప్రయాణం
* రైలులోనే పలు వర్గాలతో జనసేనాని మాటామంతీ
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ఫే స్ బుక్ ద్వారా జనసైనికులు, యువతీయువకులు, ప్రజలకు మరింత చేరువవుతున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఫేస్ బుక్ లో అఫీషియల్ పేజీని ప్రారంభించారు. ఈ పేజీ ద్వారా పార్టీ సిద్దాంతాలు, తన ఆలోచనలను పంచుకుంటారు. పార్టీ కార్యక్రమాలను కూడా తెలియచేస్తారు. ఈ పేజీలో తొలి విషయంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన అప్ డేట్ పోస్ట్ చేశారు. నవంబర్ 2 వ తేదీన విజయవాడ నుంచి తుని పట్టణానికి రైలులో చేరుకుంటున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా కొన్ని స్టేషన్లలో వివిధ వర్గాల ప్రతినిధులను కలుసుకుంటానని చెప్పారు.
* సేనానితో రైలు ప్రయాణం
జన్మభూమి ట్రైన్లో శ్రీ పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తారు. ‘సేనానితో రైలు ప్రయాణం’ పేరుతో పలు వర్గాల ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతారు. విజయవాడ నుంచి తుని చేరుకొనే వరకూ పలు వర్గాల ప్రజలతో మాటామంతీ ఉంటుంది. మధ్యాహ్నం 1 గం.20 ని.లకు రైల్వే పోర్టర్లతో మాట్లాడతారు. ఆ తరవాత మామిడి రైతులు, అసంఘటిత రంగంలో ఉన్న చిరు వ్యాపారులు, రైల్వే వెండర్లతోపాటు, రైలులోని ప్రయాణికులు, చెరకు రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారులతో ఈ ప్రయాణంలో మాట్లాడతారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *