Breaking News

బిజెపి ద ఆల్కెమిస్ట్

బిజెపి ద ఆల్కెమిస్ట్
============
“ఒక దాన్ని నువ్వు బలంగా నమ్మినప్పుడు, ప్రకృతి మొత్తం సమస్త కుట్రలు చేసైనా నీకు దాన్ని అందిస్తుంది…” — ఆల్ కెమిస్ట్ లో పౌలో క్వెల్లో. ఇందులో నిజానిజాలు తెలియవు గానీ, ఎన్నికలకు ముందు బిజెపి ఈ ఎన్నికలు మ్యాదమాటిక్స్ కాదు కెమిస్ట్రీ. ప్రజలకు మోదీ కి మధ్యనున్న కెమిస్ట్రీ అనే చెప్పింది. ఆ కన్పించని రసాయన శాస్త్రాలేవో తెలియదు గానీ మోదీ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అసలు నిజానికి ఇండియాలో ఎన్నికలెప్పుడూ కెమిస్ట్రీ ఈక్వేషన్సే. ఇక్కడ కెమిస్ట్రీ అంటే క్యాస్టే. రెండు మొదలయ్యేది “సి”తోనే. అధికార రహస్యమంతా ఆ పరమాణువుల ఫార్ములాస్ ని డీ కోడ్ చేయటంలోనే ఉంది. అందుకే ఇండియా ఎలక్షన్స్ లో గెలవాలంటే పీరియాడిక్ టేబుల్ ముందు పెట్టుకోవాల్సిందే, ప్రతి అటమిక్ నెంబర్ గుర్తు పెట్టుకొని ఎక్కడ మెల్టింగ్ పాయింటుంటుదో, ఎక్కడ బాయిలింగ్ పాయింట్ ఉంటుందో ఏఏ కెమికల్ ఎలిమెంట్ల తొ ఏఏ సందర్భాల్లో ఎందుకు కలుస్తుందో….. ఫార్ములాస్ మారుస్తూ కొత్త కొత్త కెమికల్స్ తయారు చేయాల్సిందే. కలవని అణుబంధాలను కూడా బలవంతంగా అయినా కేటలిస్ట్ సహాయం తీసుకోనైనా కలిపేయాల్సిందే.. ఇలా రసాయన శాస్త్రం మొత్తం ఔపాసన పట్టాల్సిందే.
ప్రతిపక్షాలు అన్నీ ఈ “సి” ఈక్వేషన్స్ తయారు చేయటంలో బిజీ గా ఉంటే బిజెపి మాత్రం ఒక “ఆర్” రాడికల్ ( రిలిజియన్ )ఈక్వేషన్ తయారు చేసుకంది, ఏ “సి” ఈక్వేషన్ ని అయినా బద్దలు చేయగల “ఆర్” పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఇందులోకూడా వాళ్ళు పెద్ద పెద్ద కెమికల్ ఫార్మూలాస్ జోలికి వెళ్లలేదు. సింపుల్ గా రెండు “హెచ్” (హిందూ) పరమాణువులను కలిపి ఒక “ఓ” (అదర్స్) పరమాణువు మీద దాడి చేసేలా చేశారు, ఫలితంగా వచ్చిన నీళ్ళు మన నెత్తిన పోశారు. ఆ నీళ్ళని గంగాజలం అని లేబుల్ వేశారు. అంతే… గెలుపు వారణాసి తీరానికి కొట్టుకొచ్చింది. ఆ నీళ్ళల్ళో కరిగిపోయున్న మిగతా కెమికల్స్ గురించి ప్రస్తుతానికి మాట్లాడుకోవటం అనవసరం. ఎందుకంటే నీళ్ళు జీవనాధారం. కలుషితమైనా తాగక తప్పదు. లేదంటే జీవం నిలవదు.
ఇన్నాళ్ళు కొన్ని సక్సెస్ లు, కొన్ని ఫెయిల్యూర్స్ తో నెగ్గుకొచ్చిన “సి” ఈక్వేషన్స్ అన్ని ఈ “ఆర్” ఈక్వేషన్స్ తో రసాయన శాస్త్రం మొత్తాన్ని మార్చేసింది. ఇత్తడిని పుత్తడిగా మార్చటం కూడా రసాయన శాస్త్రమే అదే పరసవేది విద్య. మార్చకపోయినా కనీసం ఏమార్చి అయినా అది పుత్తడి అని నమ్మిస్తే చాలు. ప్రస్తుతానికి బంగారం మంచిదయిపోతుంది . 
సరే, ప్రస్తుతానికి ఈ కెమిస్ట్రీని పక్కన పెట్టి మరో సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఈ సారి పక్కా లెక్కల సబ్జక్ట్, కెమిస్ట్రీ మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నా, ఈక్వేషన్స్ లో మ్యాదమాటిక్స్ ఉండక తప్పదు. ఆ లెక్కలను బట్టే ఫైనల్ ఈక్వేషన్ సెట్ అవుతుంది. కాకపోతే ఈ లెక్కలన్నీ కరెక్టేనా అనే అనుమానం మాత్రం పీడిస్తుంది. అందుకే ఇప్పుడు కొద్దిసేపు ఆ కెమికల్ మ్యాధమాటిక్స్ చూద్దాం లేకుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ని చూపించి ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్తున్నారేమో అనే అనుమానం అటు కెమిస్ట్రీ వారికి, ఇటు మ్యాధమాటిక్స్ వారికి కామన్ గా వస్తుంది. ఆఫ్ కోర్స్ ఏ కెమికల్ ఏదో సర్టిఫై చెసే ల్యాబ్ మనదైనప్పుడు అది ఆల్కలైన్ అయినా, అల్కేన్ అయినా ఒకటే..
2010 -19 మధ్య కాలంలో ఈసిఐయల్ కంపెనీ మన ఎలక్షన్ కమీషన్ కి 39,50,000 ఈవియంలు సప్లై చేసింది. కానీ, మన ఎలక్షన్ కమీషన్ మాత్రం ఇరవై లక్షల ఈవియంలే ఇచ్చారు అంటుంది. మరి ఈ 19,50,000 లే కేటలిస్టులా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకటం లేదు. కేటలిస్ట్ కి ఒక విచిత్ర లక్షణం ఉంది, రెండు కెమికల్స్ కలిపే ప్రయత్నంలో తాను మాయం అయిపోతుంది. కొత్త కెమికల్ రావటానికి దోహద పడుతుంది. ఈ కేటలిస్ట్ ఎలిమెంట్ మాత్రం ఆ కొత్త కెమికల్ లో ఎంత వెతికినా కనపడదు. ఈ 19,50,000 ఈవియంలు కూడా అచ్చు ఇలాగే మాయం అయ్యాయి. పైగా ఉత్తర భారతదేశంలో ప్రైవేటు ఇళ్లల్ళో, గౌడోన్స్ లో ఈ కేటలిస్ట్ ఎలిమంట్ లాంటి ఈవియంలు మాత్రం కుప్పలు తెప్పలు దొరికాయి. కాకపొతే కేటలిస్ట్ పోషించిన పాత్రకి సాక్ష్యాలు మాత్రం ఉండవు. 
తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వారు అటు అల్కలైన్ నో, అల్కైన్ నో ఎంచుకుంటారు తప్ప మధ్యస్తంగా ఉండవు. అది అక్కడ జనరల్ కెమిస్ట్రీ. కానీ విచిత్రంగా ఈ సారి పార్లమెంట్ సీట్లు డిఎంకె కి ఇచ్చి, అసెంబ్లీ సీట్లు మాత్రం అన్నాడిఎంకె కి అది కూడా ఆ మైనార్టీ ప్రభుత్వానికి ఎన్ని సీట్లు అయితే సరిపోతాయో అన్ని సీట్లు ఎలా వచ్చాయో మాత్రం అర్ధం కాలేదు. ‘అతడు’ సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పినట్లు ఏదో జాగ్రత్తగా, శ్రద్దగా గులాబీ మొక్కకు అంటుకంటినంత శ్రద్దగా ఓట్లేశారా ! జనాలు అంత శ్రద్దగా మాట్లాడుకోని మరీ ఓటేస్తారా ! ..ఏమో మరి మిషన్ అదే చెప్పింది…..ఆ మిషన్ ఈవియం మిషీన్ మాత్రమే, లై డిటెక్టర్ అయితే బహుశా మిషీన్ అరిచేదేమో..
ఇక తెలంగాణాకొద్దాం, ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికల్ళో బిజెపి అన్ని స్థానాల్లో పోటి చేసినా 103 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. కానీ, ఆరునెలల తిరిగేసరికి లెక్క మారిపోయింది , ఏకంగా నాలుగు పార్లమెంట్ స్థానాల్లొ గెలిచింది, అది కూడ అరకొర మెజారిటీ తో కాదు. భారీ మెజారిటీ తో. నాలుగు పార్లమెంట్ స్థానాలంటే దాదాపుగా 28 అసెంబ్లీ సీట్లు. అసెంబ్లీ ఎన్నికల్లో అతికష్టం మీద ఒక్కసీటు గెలుచుకున్న బిజెపి ఆరునెలల్లో పుంజుకోవటానికి పనిచేసింది కెమిస్ట్రీనా, మ్యాద్సా ! ఒకవేళ కెమిస్ట్రీ అయితే కన్పించని ఆ కేటలిస్ట్ ఏంటి ? మాధ్స్ అయితే ఆ లెక్క ఎలా సాధ్యం అయ్యింది !! ఆ ఫార్ములా ఏదో అర్ధం కాక అందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు. 
సరే ! ఈవియం ల లెక్కలు, కన్పించని కేటలిస్ట్ ఎలిమెంట్శ్ వదిలేద్దాం. అసలు బిజెపి ఈ ఎన్నికల్లో పాటించిన విధానాలు ఒకసారి చూద్దాం . ఎన్నికలకు సిద్దమయ్యే పార్టీలు లోపల్లోపల ఎన్ని ఈక్వేషన్స్ వేసుకున్నా, పైకి మాత్రం ఆర్ధికాభివృద్ది లెక్కలు, తొలిగించిన పేదరికం లెక్కలు ..ఇలా రకరకాల లెక్కలు బోర్డ్ మీద రాస్తాయి. కానీ, ఈ సారి బిజెపి బోర్డ్ మీద ఎలాంటి లెక్కలు రాయలేదు, అసలు ఆ మ్యాద్స్ క్లాసే లేదు. సైకాలాజికల్ ఎమోషన్ అనే కొత్త సబ్జెక్ట్ సిలబస్ లోకి తీసుకొచ్చింది. ఆ సబ్జక్ట్ లో నేషన్, నేషనాలిటీ, రిలిజీయనాలిటీ అనే లెసన్స్ ని డిజిటల్ క్లాసెస్ రూపంలో స్క్రీన్ మీద చూపించింది. బహుశా బిజెపి చెప్పిన ఈ కెమికల్ వార్ లో కన్పించని కేటలిస్ట్ గా ఈ సైకాలజీ కూడా పనిచేసిందేమో !
ఈ ఎలక్షన్స్ లో ఈవియంలు ట్యాంపర్ అయ్యాయో లేదో తెలియదు గానీ, ప్రజల సైకాలజీ మాత్రం ఖచ్చితంగా ట్యాంపర్ అయ్యింది. ఒక ఇన్ సెక్యూరిటీ లో నుండి ఉదయించిన ఒక విజయం. మరి ఈ విజయం దేశాన్ని ఏ తీరాల్లోకి తీసుకెళ్తుందో వేచి చూడాలి.

 
………….. MOHAN RAVIPATI……………….
 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *