Breaking News

మంత్రి రవీంద్ర 6వ విడత జన్మభూమిలో హైలైట్స్

మచిలీపట్నం మండలం బొర్రపోతుపాలెంలో 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న న్యాయశాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర.

🔸ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

మంత్రి రవీంద్ర కామెంట్స్

🔸బొర్రపోతుపాలెంలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది…..

🔸ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము….

🔸మీ సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని నిర్మూలించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం….

🔸ప్రజలకు చేరువగా అధికారులు మరియు ప్రభుత్వం ఉండాలని ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు….

🔸పోలవరం ప్రాజెక్ట్ పై రికార్డ్ స్థాయిలో పని జరిపిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు…

🔸ముఖ్యమంత్రి గారు తలపెట్టిన పట్టిసీమ కార్యక్రమం చాలా విజయం సాధించింది….

🔸ఎన్టీఆర్ భరోసా ద్వారా వృద్ధాప్య,వితంతు,వికలాంగ, కల్లుగీత, చేనేత మరియు అభయహస్తం ఫించన్లు ద్వారా అనేక మందికి సొమ్ము పంపిణీ చేయబడినది.

🔸చంద్రన్న మూలధనం ద్వారా డ్వాక్రా మహిళలకు చంద్రన్న మూలనిది మరియు చంద్రన్న పసుపు కుంకుమ ద్వారా అనేక గ్రూపులకు సొమ్ము పంపిణీ చేయబడినది.

🔸దీపం పధకం ద్వారా చాలా మందికి గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ చేయబడినవి.

🔸చంద్రన్న పెళ్లి కనుక ద్వారా లబ్ది దారులకు నిధులు మంజూరు చేయుట జరిగింది

🔸రాష్ట్రా విభజన ఎలా జరిగిందో మీ అందరికి తెలుసు

🔸మీ అందరికి తెలుసు మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉండిందో.. 16 వేల కోట్లు లోటు బడ్జెట్, కరెంట్ కోతలు..

🔸కార్యాలయం కూడా లేనటువంటి పరిస్థితి రాజధాని లేనటువంటి పరిస్థితి….

🔸రూ.200 ఇచ్చే పెన్షన్ ను రూ.1000 చేసాం

🔸రూ.500 ఇచ్చే వికలాంగుల పెన్షన్ ను రూ.1500 చేసాం…

🔸పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అర్హులందరికి పెన్షన్ ఇచ్చిన ఘనత ఒక్క తెలుగు దేశం పార్టీ కె సాధ్యం….

🔸మోడీ జగన్ జోడి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

🔸మోడీ కేసీఆర్ జగన్ ఏకమై చంద్రబాబు కి అడ్డంకులు శ్రీష్టిస్తున్నారు…

🔸ఈ నేలాఖరు లోగా బందర్ పోర్ట్ పనులు స్టార్ట్ చేస్తామని హామీ ఇస్తున్నాం….

🔸గత ప్రభుత్వ అస్తవ్యస్థ పాలనలో రాష్ట్రం అభివృధ్ధికి దూరమైంది.

🔸పరిశ్రమలు మూతపడి అభివృధ్ధి కుంటుపడింది.

🔸రైతు రుణమాపీ, డ్వాక్రా రుణమాపీ చేపట్టడం జరిగింది.
ఆర్ఢిక పరిస్ఠితి సహాకరిస్తే పెన్షన్ మొత్తం రెట్టింపు చేసేందుకు సియం ఆలోచిస్తున్నాం.

🔸అన్నివర్గాలకు కార్పోరేషన్ల ద్వారా ఆర్ధికసాయం.
అన్నివర్గాలకు అవసరమైన పథకాల అమలు.

🔸బందరు పోర్టుపనులు ఈనెలలోనే ప్రారంభిస్తున్నాం.

🔸బందరు మండలంలో 120కి మీ సిసి రోడ్ల నిర్మాణంచేపట్టాం.

🔸1850 కోట్లతో బందరు నియోజకవర్గంలో అభివృధ్ధి పనులు చేపట్టాం.

🔸విజయవాడ అభివృద్ధి చెందింది రైల్వేజుంక్షన్ వల్లే.. బందర్ నుంచి రెండోవ రైల్వేలైన్ వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అది పూర్తయితే మన బందర్ నుంచే ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తాయి…

🔸ప్రతిపక్షనేత కోడికత్తి డ్రామా ఆడారు.

🔸ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కొనసాగలంటే మళ్ళీ మన చంద్రబాబు గారు అధికారంలోకి రావాలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *