Breaking News

మన ఊరిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు: లంకిశెట్టి బాలాజీ

లయన్స్ క్లబ్ ఆఫ్ మచిలీపట్నం మరియు మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో తొలిసారిగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును మచిలీపట్నం మన ఊరిలో ఏర్పాటు చేయబడుతుంది.

క్యాన్సర్ వ్యాధి ప్రమాదకరము మరియు ప్రాణాంతకం. మహిళలకు మేమ్మగ్రఫీ, పాప్స్మియర్ మరియు ఐ బి స్క్రీనింగ్ ద్వారా రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు పురుషులకు గొంతు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు డాక్టర్ల సలహా మేరకు ఈ బస్సులో ఉచితంగా చేయబడును.

ఈ క్యాంపు అక్టోబర్ 27, శనివారం జిల్లా పరిషత్ సెంటర్ సి.కె.నాయుడు విగ్రహం వద్ద మరియు అక్టోబర్ 28, ఆదివారం రాజపేట ఫ్లవర్ మర్చంట్ షాదీఖానా ముందర నిర్వహించబడును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *