Breaking News

మల్లమ్మే చీఫ్ గెస్ట్…..

అనంతపురం-మహిళా సాధికారత అంటే మల్లమ్మ కి అర్ధం తెలీదు కానీ ఈరోజు అనంతపురం జిల్లా లొనే కాదు రాష్ట్రం లో ఎక్కడ మమహిళా సాధికారత ప్రోగ్రాం లు చేసిన మల్లంమే చీఫ్ గెస్ట్.ఇల్లంతా అవార్డులు,బహుమానాలు ఏకంగా ఉత్తరకండ్ లో 182 మందిIAS లకు మల్లమ్మ తన అనుభవాలను పాటాలు గా చెప్పింది ……దానితో ఒక్కసారిగా మల్లమ్మ సెలెబ్రిటీ ఐపోయింది .

mallamma and pratima
అసలు ఎవరీ మల్లమ్మ ఈమె IAS లకు పాటలు చెప్పడం ఏంటి అని తెలుసుకోవాలి అంటే……అనంతపురం జిల్లా సింగనామాల నియోజకవర్గం లిని రోటరిపురం కి వెళ్లాలిసిందే .అందుకే ఆ మల్లమ్మ గురించి ప్రపంచానికి తెలియ చేయడానికి tm9news  రోటరీపురం వెళ్ళింది.లోన్ తీసుకుని చిన్ని వ్యాపారం చేసి నెలకు 10 వేలు సంప్రదిస్తే మహిలా సాధికారత కాదు.ఆర్థికం గా సామాజికం గా స్థిమితం గా ఒక మహిళ ఒక కంపెనీ పెట్టి నెలకు లక్ష సంప్రదిస్తే మహిళ సాధికారత కాదు.
తన మామ చేసిన అప్పుకు పెళ్లయిన నెల రోకులకే కట్టుకున్న భర్త సావుకరి ఇంటికి బానిసగా తీసుకు పోతే వాళ్ళకి వాళ్ళ పశువులలి ఉదయం 3 నుండి రాత్రి 11 దాకా చాకిరీ చేసి వాళ్ళు పోసిన గంజి తాగి ఎడ్ల సావిడిలో పడుకుని ఏళ్ల తరబడి ఉఉడిగం చేసి….మొగుడు బంధువులు లు వద్దన్నా సావుకరిని ఎదిరించి బయటకు వచ్చి ఒక మారుగుదొడ్డిలో ఉంటూకాయకష్టం చేసి అంచలంచలుగా ఎదిగి ఈరోజు తన జీవిత అనుభవాలను పాటాలు గా చెపుతున్న మల్లమ్మ దగ్గర మనం నిజమయిన సాధికారత చూడవచ్చు.
1999 లో మహిలా సంఘాల్లో చేరిన మల్లమ్మ …రాత్రి బడికి వెళ్లి చదువు నేర్చుకుంది.తాను చదువు నేర్చుకుని తనలాంటి ఎంతో మంది మహిళలను ఈరోజుకి రాత్రిబడికి తీసుకెళ్తుంది.తన ఇద్దరు పిల్లలను బాగా చదివించింది. కూతురు బిఎసీ, కొడుకు అగ్రికల్చర్ మాస్టర్ డిగ్రీ చేసి వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు.సొంత ఇల్లు కట్టుకుంది.తన మామ తాకట్టు పెట్టిన పొలం 5 ఎకరాలు విడిపించుకుని భర్త వ్యవసాయం చేసుకుంటున్నాడు.మల్లమ్మ ఈరోజుకి 20 లక్షల అప్పు సంగం లో తీసుకుని తిరిగి వడ్డీ తో పోయిర్తిగా తీర్చేసింది.
సావుకరి ఇంటి నుండి బయటకొచ్చాక తినడానికి తిండి లేకుంటే తోటి పనివాళ్ళు తలా ఒక ముద్ద పైట కొంగులో వేస్తే తిని బ్రతికామని ,వారం పని చేసి ఆ డబ్బుతో మారుగుదొడ్డికి తలుపు పెట్టుకుని 4 సంవత్సరాలు అక్కడే పుల్లలతో ఉన్నామని మల్లమ్మ కంటతడి పెట్టింది.
విమానం పైన పోతుంటే చూడడమే తప్ప ఎక్కుతానని అనుకోని మల్లమ్మ ను ఆమె కధ విన్న ప్రభుత్వం ….ఉత్రరకండ్ లోని IAS శిక్షణ కు పంపింది. అక్కడ మల్లమ్మ జీవిత అనుభవాలు ఆమె పట్టుదల, దృఢత్వం , పేదరికం ,బానిసత్వం నుండి బయటపడాలి అణా ఒక బలమయిన కోరిక ….అక్కడి అధికారుల మన్నలను పొందింది.ఇదే నిజమయిన మహిళ సాధికారత అని ముక్తకంఠంతో మల్లమ్మను అభినందనాలతో ముంచెత్తారు.
ఈరోజు మల్లమ్మ మన రాష్ట్రం లోని కాదు వేరే రాష్ట్రాలకు సంఘాల్లో మహిళలలకు ,అధికారులకు శిక్షణ ఇవ్వను వెళ్తుంది.ఎక్కే రైలు దిగే రైలు,విమానాలు మల్లమ్మ 20 సంవత్సరాల కష్టానికి , పట్టుదలకు …..పట్టం కట్టాయి. జయహో మల్లమ్మ అంటూ అనంతపురం లో ఎన్నో ఎన్జి ఓ లు, మహిళ సంఘాలు సన్మానాలు చేసాయి.
కానీ మల్లమ్మ మాత్రం ఏమి మారలా అదే కష్టం చేస్తుంది.పొలం లో పని ఉంటే భర్త తో ,లేకుంటే మెస్త్రిగా పనికి పోతుంది .నెలకు 15 వేలు నుండి 20 వేలు సంపాదించుకుంటా అని సంతోషం గా చెప్పింది.తన లాంటి పెడమహిళలకు ఏ ఆపద వచ్చిన అర్ధరాత్రి కూడా లేచి వెళ్తా అనే మల్లమ్మ మనో థేయిర్యం ఆమె మంచితనానికి నిదర్శనం గా కణిపూస్తున్నాయి……

ప్రతిమ -అనంతపురం(tm9news)

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *