Breaking News

మీకు కూడా మేము భయపడేలా.. సిగ్గుండాలి మాట్లాడితే….



విశాఖ విమానాశ్రయంలో జగన్ మీద జరిగిన దాడిని చూస్తే అనేక అనుమానాలు తావిస్తుందన్నారు సీఎం చంద్రబాబు. విమానాశ్రయం సిఐఎస్ఎఫ్ పరిధిలో ఉందన్న చంద్రబాబు అసలు ప్రతిపక్ష నేత అంత బాధ్యతారాహిత్యంగా ఎలా వెళ్ళిపోతారని? గవర్నరు ఫోన్ చేసి డీజీపీని నివేదిక ఎలా అడుగుతారని ప్రశ్నించారు. జరుగుతున్నవన్నీ చూస్తుంటే వారి పరిస్థితి అర్థమవుతుందన్నారు. ఎయిర్ పోర్ట్ కేంద్రం అధీనంలోది.. దాడి జరిగింది ప్రతిపక్ష నేత మీద.. చేసింది అయన అభిమాని.. నిందలు టీడీపీ ప్రభుత్వం మీదనా? దాడి జరిగిన తర్వాత అయన విమానం ఎక్కి వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఒక సామాన్య వ్యక్తి ఇలా వెళ్తుంటే ఊరుకుంటారా? ఎటుపోతోంది రాష్ట్రం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సిఐఎస్ఎఫ్ బాధ్యత లేదనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ ప్రధాని అద్వర్యంలో వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందన్న సీఎం చరిత్రలో ఎన్నడూ ప్రజాస్వామ్యం ఈస్థాయిలో పతనం కాలేదన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం మీద ఘాటు ఆరోపణలు చేశారు. సిబిఐ డైరెక్టరును మార్చే అధికారం కేంద్రానికి లేకపోయినా డైరెక్టరును తొలగించారన్నారు. అర్ధరాత్రి వేళ డైరెక్టరును మార్చారని రాఫెల్ డీల్ నుండి తప్పించుకోడానికి ఈ ప్రయత్నం అన్నారు. రాష్ట్రం మీద పెద్దసంఖ్యలో ఐటీ అధికారులను పంపించారని రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా భయపెడుతున్నారన్నారు.

సీఎం చంద్రబాబు కేందం మీద నిప్పులు చెరిగారు. కేంద్రాన్ని ఉద్దేశించి సీఎం ఇంత దుర్మార్గమైన పాలనను చూడలేదన్నారు. మనకి రావాల్సినవి అడిగితే దాడులు చేయిస్తారా? ప్రత్యేక హోదా అడిగితే రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారా? అని ఘాటుగా స్పందించారు. చౌకవారు రాజకీయాలు చేస్తే చూస్తూ ఉండబోమని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకొనేది లేదన్నారు. దేశాన్ని బ్రష్టు పట్టించారని హుందాగా ప్రవర్తిస్తే ప్రజలు ఆమోదిస్తారన్నారు. జగన్, పవన్ లకు తోడు ఇప్పుడు కెసిఆర్ కూడా ఏపీని టార్గెట్ చేశారన్నారు. తిత్లీ తుఫాన్ అంత విధ్వంసం సృష్టిస్తే స్పందించని కెసిఆర్, కేటీఆర్, కవితలు ఇప్పుడు ఆఘమేఘాల మీద స్పదించారన్నారు. జీవీఎల్ నరసింహన్ ఒకహీరోలా మాట్లాడుతున్నారని.. మీకు కూడా మేము భయపడేలా.. సిగ్గుండాలి మాట్లాడితే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని పరిస్థితులు గుర్తించి మాట్లాడాలన్నారు.  ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదన్న సీఎం చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. కేంద్రం ఇన్ని డ్రామాలు చేసేది రాష్ట్రాలను నాశనం చేయడానికేనన్న అయన కేంద్రం తగిన మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉందన్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *