Breaking News

రఘుపతి వెంకట రత్నం నాయుడు కాంస్య విగ్రహమును అమెరికన్ పోగ్రసివ్ తెలుగు అసోసియేషన్ apta ఆధ్వర్యంలో ఆవిష్కరించిన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ,పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ,muda చైర్మన్ వేదవ్యాస్….

కృష్ణ జిల్లా మచిలీపట్నంలో జిల్లా కోర్ట్ సెంటర్ నందు రఘుపతి వెంకట రత్నం నాయుడు 156 జయంతిని పురస్కరించుకొని 600 కేజీల కాంస్య విగ్రహమును ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుధ ప్రసాద్ , న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర , మూఢ చైర్మన్ వేదవ్యాస్, ఆవిష్కరించారు. రఘుపతి వెంకట రత్నం నాయుడు బందరులో జనమించటం బందర్ ప్రజల అదృష్టమా అని , రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862, అక్టోబరు 1 న మచిలీపట్నంలో సుప్రసిద్ద తెలగ నాయుళ్ళ ఇంట జన్మించాడు[3]. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్) నగరంలో మొదలయింది. హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి హైదరాబాదు బదిలీ కావడంతో, అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాల గురించి పట్టించుకోరాదు అనే వారామె.

ఎం.ఏ. కాగానే మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఇంగ్లీషు ఆచార్యునిగా పనిచేసాడు. 1904లో కాకినాడ లోని పిఠాపురం రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు. 1911లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు. 1925లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేసాడు. 1924లో బ్రిటిష్ ప్రభుత్వాంచే నైట్ హుడ్ పురస్కారాన్ని పొందాడు. 1927లో పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో నాయుడును గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.. అయన భోధన ద్వారా అనేక మంది ప్రముఖులను సమాజానికి అందిచిన ఘనత ఆయనకే దకింది అని కొనియాడారు. మండలి బుధ ప్రసాద్ మాట్లాడుతూ విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా ఆంధ్రప్రదేశ్ లో పేరుపొందిన వ్యక్తి. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులుతో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే. అని ప్రసంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *