Breaking News

నోటి దురుసు ఆమెను నవ్వులపాలు చేసిందా?.. ……….

వస్తున్న వార్తల ప్రకారం రోజా కి మంత్రిపదవి ఇవ్వలేదు అని తెలుస్తుంది.. రెండేళ్ళ క్రితం “రోజా” గురించి ఒక ఆర్టికల్ రాశాను. ఇప్పుడు అది గుర్తుకొచ్చింది

రోజా” ఈ పేరు తెలియని తెలుగు వాడు లేడు. కొంచెం భాష మీద అదుపు ఉన్నట్లయితే ఎక్కడో ఉండాల్సిన డైనమిక్ లీడర్. ఆ ధైర్యం , ఎవరినైనా నిలదీయగల దమ్ము, దేనికీ వెరువని స్థైర్యం నిజంగా అభినందనీయం. మహిళగా ఇన్ని విజయాలు సాధించటం సామాన్యమైన విషయం కాదు. రాజకీయ రంగంలోనే కాదు, సినీరంగంలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

నాకు రోజా అనగానే మొదటగా గుర్తొచ్చేది “సమరం” సినిమా !! స్వంత నిర్మాణ సంస్థ ద్వారా తన సోదరుడు పేరుతో రూపొందిన ఈ సినిమా కోసం ఈమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. అటు ఆ షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగినా వెనక్కి తగ్గలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదరైనా మొండిగా నిలబడి మరీ ఆ సినిమా ని రూపొందించింది. అనుకున్నంత విజయం సాధించక పోయినా ఆమె కష్టానికి గుర్తింపు వచ్చింది. షూటింగ్ సమయంలో నే, ఆ సినిమా దర్శకుడు సెల్వమణితో ప్రేమలోపడి , కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పినా లెక్కచేయకుండా పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత రాజకీయాలలో తెదేపాతో ప్రస్థానం ప్రారంభించింది. ఆ తర్వాత కాంగ్రెస్ అక్కడనుండి వైకాపా లోకి వెళ్ళింది. ఎక్కడున్నా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. దురదృష్టవశాత్తూ ఈమెకున్న ధైర్యం, మొండి తనం సరైన దారిలో కాక, కేవలం ఎదురుదాడి చేయటం కోసం, ఎవరినైనా తిట్టటం కోసమే ఉపయోగపడింది. అందరూ ఆమె ధైర్యానికి కాకుండా, నోటికి భయపడటం ప్రారంభించారు. ఎదుటివారు భయపడటం చూసిన రోజా తన అసలైన ఆయుధం ధైర్యం కాకుండా, తాత్కాలికంగా ఉపయోగపడే నోటిని ఆయుధంగా మలచుకుంది.దానితో అందరిలో చులకనైంది. ఆ పొరపాటు తెలుసుకోలేని రోజా మరింతగా నోటిని ప్రయోగించింది. బహుశా ఆమెను దానికే పరిమితం చేయటం వైకాపా వ్యూహం కూడా కావచ్చు. దానితో ఆమె ఎదగాల్సినంత స్థాయికి ఎదగలేదు. నిజానికి సమకాలీన రాజకీయాలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జయలలిత మరణం తర్వాత , డైనమిక్ గా వ్యవహరించే మహిళ ఒక్కరు కూడా లేరు. స్థాయిలో కాకపోయినా, రోజా డైనమిజంలో జయలలిత కి తీసిపోదు. కానీ, కేవలం నోటి దురుసు ఆమెను నవ్వులపాలు చేసింది.అదొక్కటి లేకుంటే ఆమె ఏ పార్టీ లో ఉన్నా ఆ పార్టీకి బలం అయ్యేది. దురదృష్టం !! ఆమె‌, ఏదైతే తన బలం అనుకుందో ఆదే ఇప్పుడు బలహీనత అంటూ పార్టీ భావించి దూరం పెట్టటం భాధాకరం. పార్టీ ఆమెను ఇన్నాళ్ళు ఎందుకైతే ప్రోత్సహించిందో, అదే ఆమె పొరపాటు అని ఆమెను బలివ్వటం కాంగ్రెస్ మార్కు రాజకీయమైనా, ఏమీ చేయలేని పరిస్థితి. ఆమె ,ఆమెను అంచనా వేసుకోవటంలో ఫెయిల్ అయ్యింది. తన బలమైన ధైర్యం, ఆత్మస్థైర్యం , మొండితనాన్ని మరచిపోయి, బలహీనతైన నోటిదురుసు ని తన బలం అనుకుంది.

.
తనను తాను సరిగా అంచనా వేసుకోలేక, తన బలాలను వదిలేసి, బలహీనతలను నమ్ముకొని‌‌ మోసపోయిన ఒక మహిళగా మిగిలి పోయింది.

రోజా ఇలా ఉండటం నాకు నచ్చదు. తన బలాలను గుర్తెరిగి యుద్ధం చేసే వీరమహిళ గా ఆమెను చూడాలనుంది (2017 article)

 —–moahan ravipati…………

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *