Breaking News

వైకాపా ప్రభుత్వం విధించిన కరెంటు బిల్లులుతో జనం బెంబేలు

వైకాపా ప్రభుత్వం విధించిన కరెంటు బిల్లులుతో జనం బెంబేలు
* ఎమ్మెల్యే గద్దె రామమోహన్

GADDE CURRENT BILL 01 GADDE CURRENT BILL
విజ‌య‌వాడ‌‌: కరోనా తీవ్రత దృష్ట్యా నెలల తరబడి లాక్‌డౌన్ అమ‌‌లు కార‌ణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను జగన్ ప్రభుత్వం కరెంటు బిల్లుల పేరుతో మరింతగా హింసిస్తుందని విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో భాగంగా ఆయన శనివారం 7వ డివిజన్ శిఖామణి సెంటర్ ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు పెద్ద ఎత్తున కరెంటు బిల్లులపై ఫిర్యాదు చేశారు. చోడగుడి సుదర్శనరావు వీధిలో ఒంటరిగా నివసిస్తున్న లంక నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఇటీవల తన ఇంట్లో మీటర్ రీడింగ్ తీసిన అధికారులు రూ.8వేలు బిల్లు ఇచ్చి కట్టకపోతే ఫీజులు తీసేస్తామని బెదిరిస్తున్నారంటూ, ఈ ప్రాంతంలో అన్ని ఇళ్ళల్లో ఇదే సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చింది. బిల్లులను పరిశీలించిన గద్దె ఈ విషయాన్ని విద్యుత్ ఏఈ నాగబాబు దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన తన సిబ్బందితో వృద్ధురాలి కరెంటు బిల్లును, మీటర్ రీడింగ్‌ను పరిశీలించారు. మీటర్ రీడింగ్ తీసే సమయంలో టెక్నికల్ ఇబ్బంది తలెత్తటంతో కరెంటు బిల్ తేడా పడిందని శనివారం ఆదివారం శెలవు దినం కావటంతో సోమవారం ఆమె సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. బిల్లుల చెల్లించలేక ఆందోళన పడుతున్న ప్రజలు అనంతరం గద్దె రామమోహన్ మాట్లాడుతూ వైకాపా నియంతృత్వ పాలనకు ఇదొక ఉదాహరణ అన్నారు. ఇలాంటి కరెంటు బిల్లులు నగరంలో చాలా చోట్ల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నారు. ఒంటరి మహిళలు వృద్ధులు, సామాన్య ప్రజలు వేలల్లో వచ్చిన తమ కరెంటు బిల్లులను చూసుకుని మానసికంగా ఆందోళన చెందుతూ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ప్రతి నెల నాలుగైదు వందలు వచ్చే నాగేశ్వరమ్మ కరెంటు బిల్లు ఒక్కసారిగా రూ.8 వేలు కావడంతో ఆమె బెంగతో ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజలను అన్నివిధాల ఇబ్బందులకు గురిచేస్తుందని, ఇటువంటి సమయంలో సామాన్యులకు అర్ధంకాని రీతిలో నూతన స్లాబ్ విధానాలు అంటూ కరెంటు బిల్లులు విధించి, వేలల్లో వచ్చిన బిల్లులను కట్టాలంటూ వారిపై ఒత్తిడి తీసుకురావటం ఎంతో భాధకారం అన్నారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ వలన పనులు లేక పస్తులు ఉంటూ ఇక్కట్లు పడుతున్న పేద కుటుంబాలకు నెలకి రూ.5వేలు ఇవ్వాలని, సంవత్సర కాలంలో జగన్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలిపుతూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు ఉడ్‌పేటలో వాటర్ లైన్ సమస్య నెహ్రునగర్‌లో డ్రైనేజీ సమస్యలతో పాటు డివిజన్లోని పలు సమస్యలను గద్దె రామ్మోహన్‌కు తెలియజేశారు. చీరలు పంపిణీ డివిజన్‌లోని 30 మంది వృద్ధులకు అమ్మ ఫౌండేషన్ త‌ర‌ఫున గద్దె రామమోహన్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ పేదలకు వివిధ రకాలుగా సహాయాలు అందిస్తున్న అమ్మ పౌండేషన్ వ్యవస్థాపకులు రమణను అభినందించారు. కార్యక్రమంలో సొంగా సంజయ్ వర్మ, అన్నే వీరభోగ వసంతరాయులు, దయాల శిరీషా గాంధీ, కొండవీటి లక్ష్మణరావు, సురేష్‌కుమార్, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *