Breaking News

వైసిపిపై మూడునెలలకే ముప్పేట దాడులు

 

వైసిపిపై మూడునెలలకే ముప్పేట దాడులు

. చిన్న చిన్నను భూతద్దంలో చూసి  టిడిపి మాపై విమర్శలు చేస్తుందంటున్న వైసిపి

. కావాలనే పల్నాడులో వివాదాలు

. కోడెల మృతిని రాజకీయం చేస్తున్న చంద్రబాబు

. బోటు ప్రమాదం ప్రభుత్వ వైఫల్యం కాదు … బోటు యజమాని తప్పిదం

 పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లుంది టిడిపి వైఖరి …  వైసిపి అధికారంలోకి వచ్చిన వందరోజులలో నే వారి పాలనపై అనేక విమర్శలను చేసి వారిపై ముప్పేట దాడులకు సిద్దమైందని వైసిపి నాయకులు విమర్శిస్తున్నారు… ఏచిన్న అంశం దొరికినా వదల కుండా చంద్రబాబు మొదలు కొని చిన్న నాయకుల వరకు ఒకటే విమర్శలు చేస్తున్నారని  … వైసిపి పాలనను వివాదాల పాలనగా చిత్రీకరించడానికి టిడిపి విస్వప్రయత్నాలు చేస్తుందని వైసిపి శ్రేణుల ఏకరువు పెడుతున్నాయి ….

 వందరోజుల పాలన ప్క్కన పెడితే వైసిపి పై టిడిపి చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్ని కాదు … ప్రజాదర్భార్ కూల్చివేతతో మోదలైన రచ్చ ఇప్పటి కోడెల మరణం దాకా ఓ పెద్ద చిట్టానే టిడిపి ఫైల్ చేసింది … రోజుకో అంశంతో టిడిపి నాయకులు వైసిపి పై విమర్శలు గుప్పిస్తూనే ఉంన్నారు… మోదటిగా వచ్చిన ప్రజాదర్భార్ అంశం పెద్దదుమారమే లేపింద … కావాలనే వైసిపి ప్రభుత్వం ప్రజాదర్భార్ ను నాశనం చేసిదని టిడిపి ఆరోపిచగా అది అక్కమకట్టడమని నదీపరివాహక ప్రాంతంలో అక్రమకడ్డడాలు కట్టకూడదని తెలిసినా చంద్రబాబు అక్కడ కట్టించడం చట్ట ఉల్లంఘనే అన్ని వైసిపి సమర్దవంతంగా నేఈ అంశాన్ని తిప్పికొట్టింది ,..

  ఇక అసెంబ్లీ సమావేవాల అంశానికి వస్తే అక్కడ కూడా టిడిపి వైసిపిపై తీవ్ర విమర్శలే చేసింది … బిల్లు సమయంలో అసెంబ్లీలో లేకుండా వాకౌట్ చేసి వైసిపి తప్పదంగా చిత్రీకరించాలని చూసినప్పటికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిలకలులన్నీ ప్రజా ఉపయోగంగా ఉండటంతోల టిడిపి నోరుమెదపలేక పోయింది … అసెంబ్లీ అయిన వెంటనే వరదలు రావడం ప్రతిపక్షనేత చంద్రబాబు ఉంటున్న ఇల్లు మునగడం దానిని కూడా టిడపి రాజకీయంగా వాడుకోవటం వంటి అంశాలు వారికి కలిసోచ్చాయని టిడిపి అనుకుంటుంటే .. ఇవన్నీ ప్రజలునమ్మేలా లేకపోవడంతో మళ్ళీ టిడపి కొత్త విమర్శల కోసం ఎతకటం మోదలు పెట్టింద … ఈ లోపె కోడెల అంశం బయటకు రావడం అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో కోడెలపై అనేక విమర్శలు రావడంతో అందులోనుంచి ఎలా బయటపడాలా అని చలో ఆత్మకూరుకు చంద్రబాబు రంగం సిద్దం చేసినట్లు వైసిపి నాయకులు మండిపడ్డారు…

 ప్రభుత్వం పై బురదజల్లడానికి కోత్తకోణాలను వెతకటంలో టిడిపి నాయకులకు సాటి ఎవ్వరూలేరని వైసిపి శ్రేణులు యండి పడుతున్నాయి … ప్రమాదవశాత్తు బోటు ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో  ప్రణాలు కొల్పోతే ప్రబుత్వం కనీసం వారిని పట్టించు కోలేదని టిడపి మాట్లడటం మంయచి పద్దతి కాదనని వైసిపి నాయకులు అంటున్నారు… ప్రమాదం జరిగిన వెంటనే మంత్రలు , అదికారులు అక్కడికి చేరుకుని సహాకచర్యలను ముమ్మరం చేశారని అయినా టిడిపి దీనిపై వివాదాన్ని రేపడానికి తెరలేపిందన్నారు… గతంలో టిడిపి ప్రభుత్వం అదికారంలో ఉన్న సమయంలో విజయవాడ కృష్ణా నదిలో పడవ మునిగి పోయిన ఘటనలో , గోదివరి పుష్కరాలకు ఘటనలు వారికి గుర్తుకు లేదా అని వైసిపి నాయకులు వారిని ప్రశ్నించారు….

 కోడెల విషయానికి వస్తే ఆయన ఆయన కుమారుడి వల్ల చనిపోయాడని టిడిపి వారే అంటుంటే చంద్రబాబు , ఆయన తనయుడు మాత్రం దీనికి వైసిపి నాయకులు కారణమంటూ చెప్పడం శవరాజకీయాలకు పరాకాష్టగా మారిందని వైసిపి నాయకులు విమరశించారు.. కోడెల తప్పచేస్తే అది పోలీసు , చట్టం చూసుకుంటుందని అది కూడా వైసిపి తప్పిదంగా చిత్రీకరించడానికి టిడిపి నానా అవస్తులు పడుతుందని వైసిపి నాయకులు మండిపడుతున్నారు…

 శవరాజకీయాలు చేయడం టిడిపికి తప్ప ఎవరికీ చేతకావని … కనీసం ఏసయంలో విమర్శలు చేయాలో కూడా వారికి తెలియదని వైసిపి నాయకులు విమర్శిస్తున్నారు… శవాలను పక్కన పెటుకుని డ్రామాలు ఆడటం మాకు చెతకాదని , చిల్లర రాజకీయలు , చిల్లర విమర్శలు మాకు తెలియవని వైసిపి నాయకులు అంటున్నారు…

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *