Breaking News

శవం మీద చిల్లర…….

శవం మీద చిల్లర

దమ్ముంటే మీరు మీ ఇంట్లో కులాంతర వివాహాలు చేయండి అంటూ కొంతమంది సూడో మేధావులు ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారు .. మానవత్వమున్న మనుషులుగా ప్రణయ్ దారుణ హత్య ని అందరూ ఖండించాల్సిందే .. కులాంతర వివాహం చేసుకుంటే మనిషిని అంత దారుణంగా చంపేస్తారా అందరూ ప్రశ్నించారు .. ప్రేమిస్తే చంపేస్తారా అంటూ అందరూ నిలదీశారు .. ఇందులో తప్పేముందో అర్దం కాలేదు .. ఆ ప్రణయ్ కి మద్దతు పలికిన వారు మీ ఇళ్లల్లో ముందు కులాంతర వివాహం చేయండి అంటూవితండ వాదం చేస్తున్నారు ..రేపు మా పిల్లలు ఒక వేళ వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తే తప్పకుండా అంగీకరిస్తాం .. అంతేగానీ ఆ అబ్బాయిని హత్య చేసి కులోన్మాదులుగా చరిత్రలో నిలిచిపోలేము ..

ఒక మనిషి నిండు ప్రాణం నడిరోడ్డు మీద రక్తపు మడుగులో అల్లాడిపోతే కనీస జాలి అన్నదే లేకుండా హంతకుడు
మారుతీరావుని సమర్ధించే వాళ్లని ఏ కుల భాషలో తిట్టాలి ..
పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేసుకుని పంతొమ్మిదేళ్లకే పిల్లల్ని కండానికి సిద్దమైందని అమృత పై నిందలేస్తున్నవారు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి ..
ప్రేమకి కులం తెలీదు .. మనం కులం వాళ్లనే ప్రేమిద్దామని మనసు డిసైడ్ చేసుకుని ప్రేమించదు .. అలా వచ్చేది కుల ప్రేమ .. ఒక వయసు వచ్చాక సహజంగానే శరీరంలో వచ్చే మార్పులు ,ఆకర్షణ కారణంగా ఆడ , మధ్య ప్రేమ చిగురించడం మానవ సహజం .. ప్రేమించుకున్నాక , కొన్నాళ్లకి గానీ వారిద్దరి కూలం ప్రస్తావన రాదు .. ఇది కేవలం ప్రణయ్ , అమ్రుత లకే పరిమితం కాదు ..

మనందరిలోనూ ఒక ప్రణయ్ ఉంటాడు .. మనందరిలోనూ ఒక అమృత ఉంటుంది .. ఇప్పుడు మారుతీరావుకి సపోర్ట్ చేస్తున్న కుహనా మేధావులకి నా ప్రశ్న .. నిజం చెప్పండి .. మీ జీవితంలో అకర్షణకి , ప్రేమకి మీరు లొంగలేదా .. అసలు మీ జీవితంలో ప్రేమ అనే ఎపిసోడ్ లేదా ?? అందరూ మీ మీపెద్దలు చూసిన మీ కులపోళ్ల అమ్మాయి తప్ప అంతకుముందు ఇంకో అమ్మాయి మీ జీవితంలో లేదా .. ఒక వేళ ఉంటే ఆ అమ్మాయిని నువ్వు మా కులం అమ్మాయివేనా అని అడిగి ప్రేమించారా ??

ప్రకృతి సహజంగా జీవితంలో వచ్చే మార్పులని ఎవరూ మార్చలేరు .. నిండు నూరేళ్లు కాకపోయినా కనీసం డెబ్బై ఏళ్లైనా సంతోషంగా అమృత తో కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన ప్రణయ్ ప్రాణం తీసే అధికారం ఎవరిచ్చారు .. ఆ ఆధికారం జన్మనిచ్చిన తల్లి దండ్రులకి కూడా లేదు ..

బాగా ఆస్తి ఉన్న అమ్మాయిని చూసి ప్రేమ పేరుతో వల్లో వేసుకుంటారని అంటున్నారు ..ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఎప్పుడైనా మారుతీరావుని ప్రణయ్ డబ్బులు కావాలని అడిగాడా ?? లేదే .. వాళ్ల జీవితమేదో వాళ్లు బతుకుతున్నారు కదా .. ఒకవేళ రేపు అడిగాడే అనుకుందాం .. నువ్వు నీ కూతురికి కాక ఇంకెవరికి ఇస్తావ్ .. సంపాదించినదంతా పోయేటప్పుడు కట్టుకుపోతావా ??

పోనీ నీకు నచ్చిన నీ కులపోడుకి ఇచ్చి పెళ్లి చేసి అమెరికా పంపిస్తావ్ .. పోనీ అప్పుడు ఆ అల్లుడు అదే మీ కులపు మొనగాడు ఆ అమ్మాయిని సరిగా చూసుకుంటాడని గ్యారంటీ ఉందా .. ఎన్ని అరేంజ్డ్ మ్యారేజెస్ ,సొంతకులపు సంబంధాలు సంతోషంగా కలకాలం నిలుస్తున్నాయి .. అదే జరిగితే ఇవాళ సోసైటీలో చాలా మంది అమ్మాయిలు పిల్లలు పుట్టాక భర్తని వదిలి తల్లిదండ్రుల దగ్గరకి ఎందుకు వచ్చేస్తున్నారు .. శాడిస్ట్ మొగుడు అరాచకాలని భరించలేక పోతున్నామని టీవీ స్టూడియోలకి ఎక్కి ఎందుకు ఏడుస్తున్నారు .. కోట్లాదిరూపాయల కట్నం తీసుకుని ఆ తర్వాత ఆ అమ్మాయిని పనిమనిషిగా మార్చి ఇంకో అమ్మాయితో ఎఫైర్లు నడిపే మన కులపు అళ్లుల్లు ఎంతమంది లేరు చెప్పండి ..

నువ్వు కన్నావు కాబట్టి నీ కూతురి మీద నీకు హక్కు ఉండొచ్చు .. కానీ ఆ కుర్రాడి మీద నీకేమి హక్కు ఉంది .. అతన్ని చంపి నీ శాడిజాన్ని శాటిస్ఫై చేసుకుంటే చూసి ఫేస్ బుక్ పోస్టుల్లో అతన్ని సమర్ధించి మీరు విక్రుతానందం పొందుతారా ??

ఇప్పుడు మారుతీరావుని సపోర్ట్ చేస్తున్న వారి ఆడపిల్లలందరికీ ఈ కులపోళ్లనే అల్లుడిగా తెచ్చుకుంటామని గ్యారంటీ ఉందా ?? మీ కూతుళ్లు ఇంకో కులం కుర్రాళ్లతో లవ్ లో పడకుండా ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తారా ?? ఒక వేల మగ పిల్లలలు లేని కాలేజీలు , స్కూళ్లలో ఆడపిల్లలని చదివిస్తారు బాగానే ఉంది .. కానీ శరీరం లో వచ్చే సహజ ఆకర్షణని ఎలా కంట్రోల్ చేయగలరు .. ఆ వయసులో వచ్చే ఎట్రాక్షన్ కారణంగా ఏదో అంశాల్లో అవతలి వ్యక్తి నచ్చడం వల్ల ఆఖరికి కారు డ్రైవర్ తో కూడా అమ్మాయిలు ప్రేమలో పడతారు .. అది మానవ నైజం ..దీన్ని ఎవరూ మార్చలేరు ..

పిల్లల్ని కనగలం గానీ వాళ్ల తలరాతల్ని కనలేము కదా .. రెక్కలొచ్చే వరకే పక్షి పిల్లలు తల్లి రెక్క కింద రెస్ట్ తీసుకుంటాయి .. ఎగరడం వచ్చాక స్వేచ్చగా అకాశంలోకి ఎగిరిపోతాయి ..
అయినా మంచోడెవరో చెడ్డొడెవరో మనం ఎవరినీ డిసైడ్ చేయలేం .. ప్రతి మనిషిలోనూ మంచోడు , చెడ్డోడు ఉంటారు .. అవకాశాంజి బట్టి మంచి , చెడు పురి విప్పి నాట్యమాడుతుంటాయి ..

ఒక్కటి గుర్తు పెట్టుకోండి సోకాల్డ్ వితండ వాదుల్లారా ?? కుహనా మేధావుల్లారా ??, మారుతీరావు వారసుల్లారా ??అపరిపక్వ ఆలోచనా పరుల్లారా ?? మంచితనపు ముసుగులో బతికేసే మహా నటుల్లారా ..!!
సరైన అవకాశాలు రాక , ఉన్న అవకాశాలని సరిగా వినియోగించుకోలేక లోకంలో కొంతమంది “మంచివాళ్లుగా” మిగిలిపోతుంటారు …

అశోక్ వేములపల్లి

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *