Breaking News

శ్రీ కొల్లూరి రామకృష్ణ రావు గారి కాంస్య విగ్రహ ప్రతిష్టించిన చైర్మన్ బాబా ప్రసాద్  

ఈరోజు తేదీ10.01.2019 ఉదయం   స్థానిక 14వ వార్డు బుట్టాయి పేట నందలి శ్రీ అన్నం వీరరాఘవమ్మ మరియు రాఘవరావు గారు కళ్యాణ మండపము నందు స్వర్గీయ శ్రీ కొల్లూరి రామకృష్ణ రావు గారి కాంస్య విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య గారు  మున్సిపల్ చైర్మన్ శ్రీ మోటమర్రి వెంకట ప్రసాద్ గారు, తాతారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ శ్రీ కొల్లూరి రామకృష్ణారావు గారు ఎంతో సేవాసమితి కలిగిన వ్యక్తి అని మచిలీపట్నంలో అద్వానంగా ఉన్న స్మశానాన్ని ఔషధంగా అభివృద్ధి చేశారని తెలియజేశారు. అదేవిధంగా బృందావనపుర కళ్యాణ మండపం, వాసవీ సేవా సంస్థ వ్యవస్థాపకులుగా పనిచేశారన్నారు.  కన్యకా పరమేశ్వరి దేవస్థానం అభివృద్ధి కొరకు 25 సంవత్సరాలు సెక్రటరీగా పని చేశారన్నారు, గోసంఘం కోసం గా కార్యనిర్వాహకులుగా పని చేశారని, అదే విధంగా AVOP అధ్యక్షులు గా ఎనలేని కృషి చేశారన్నారు. పట్టణంలో ఎంతో మందికి ఉచిత వివాహాలు ఉపనయనాలు విరివిగా చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ధనవంతులు గారు కూరాళ్ళ   రామచంద్రరావు గారు,  యండూరి సురేష్ గారు, వూర సురేందర్ గారు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *