Breaking News

సమ్మెకు సై

aps rtc లో ఈ సారి సమ్మె సైరన్ గట్టిగానే వినిపించబోతుంది. రెండు ప్రధాన యూనియన్ లు అయినటువంటి ఎంప్లాయిస్ యూనియన్ ,నేషనల్ మాజ్దూర్ యూనియన్ ల నాయకులు సమ్మెకు సై అనడంతో  rtc లో ఈసారి సమ్మె గట్టిగానే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎంప్లాయిస్ యూనియన్ మే 9 న నోటీస్ ఇస్తామని చెప్తే nmu నాయకులు ఒక రోజు ముందే నోటీస్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. భారీ డిమాండ్ లతో md ని కలిసిన యూనియన్ నాయకుల ఆశలు తీరుతాయా

ఈ నెల 22 తరువాత సమ్మెకు సిద్ధమైన nmu

నోటీస్ ఇచ్చాక కార్యాచరణ ప్రకటించనున్న eu

మొత్తం 46 డిమాండ్ లని rtc md సురేంద్రబాబు ముందు ఉంచిన nmu నాయకులు

30 డిమాండ్ లతో 10 సంఘాలతో కలిసి నోటీస్ ఇవ్వనున్న eu

సమ్మెకు కలిసి రావాలని nmu ని కోరిన eu

Eu ఇచ్చిన టైం కంటే ఒక రోజు ముందే నోటీస్ ఇచ్చిన nmu

rtc లో మళ్ళీ సమ్మె హార్న్ మోగబోతుంది. రెండు ప్రధాన కార్మిక సంఘాల నాయకులు సమ్మెకు సై అంటున్నారు. ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ గెలుపొందినా బలాబలాలు చూపించుకునేందుకు రెండు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. నేషనల్ మాజ్దూర్ యూనియన్ 46 డిమాండ్ లతో md ని కలిస్తే 30 డిమాండ్ లతో eu సంఘం md ని కలవబోతుంది. nmu ప్రధాన అజెండాగా కొన్ని డిమాండ్ లని సురేంద్రబాబు ముందు ఉంచారు. కార్మికుల వేతన సవరణ వెంటనే చెల్లించాలనే ప్రధాన డిమాండ్ తో పాటు సిబ్బంది కుదింపు ,గ్రావిటీ తగ్గింపు నిర్ణయాలను ఉపసహరించుకోవాలని నోటీస్ లో పేర్కొన్నారు. దానితో పాటు

అద్దే ఆర్టీసీ బస్సులను ఉపసంహరించుకోవాలని

ఆర్టీసీకి చెల్లించాల్సిన 670 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని

ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 22 తర్వాత సమ్మెకు దిగుతామని సమ్మె కి దిగటం లో వెనుకడుగు వేసేది లేదని nmu తేల్చి చెప్పింది

 అయితే డిమాండ్ లు తీర్చాలని ముందుగానే నోటీస్ ఇవ్వాలని అనుకున్న eu అనుకున్నట్లుగానే మే 9 న నోటీస్ ఇవ్వబోతోంది. డిమాండ్ ల విషయం లో కొంచెం వ్యత్యాసం ఉన్న ప్రధాన డిమాండ్ లని md ముందు ఉంచబోతున్నారు. Nmu 46 డిమాండ్ లు తీసుకెళ్తే,eu కేవలం 30 డిమాండ్ లని మాత్రమే md సురేంద్రబాబు ముందు ఉంచబోతున్నారు. నోటీస్ ఇవ్వటానికి ముందు rtc jac నాయకులంతా రేపు 10 గంటల ముప్పయి నిమిషాలకి భేటీ అయి అనంతరం 11 గంటలకి md కి నోటీస్ ఇవ్వబోతున్నారు. ప్రధాన డిమాండ్ లుగా 40% అరియర్స్ డబ్బులు వెంటనే చెల్లించడం తో పాటు,సిబ్బంది కుదించెే చర్యలు మానుకోవాలని,అద్దెబస్సులు పెంచెే ప్రతిపాదనలు విరమించుకోవాలని

CCS కు చెల్లించాల్సిన రూః 285 కోట్లు వెంటనెే చెల్లించాలనే డిమాండ్ లని ప్రధాన డిమాండ్ లుగా eu md ముందు ఉంచబోతుంది.

అయితే ఇక్కడ ఎవరికి వారు నోటీసు లు ఇస్తామంతున్నారు. సమ్మె విషయం లో కలసి పోరాడే విషయమై చర్చించుకుంటామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలు లేకపోవటం అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి కొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది. Rtc ఎండి సురేంద్రబాబు మాత్రం ప్రభుత్వం తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు. పరిస్థితి చూస్తే మరొక 20 రోజుల వరకు ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపించటం లేదు. మరి అన్ని రోజులు ఆగుతారా లేక చెప్పినట్టు 22 తరువాత సమ్మెకు వెళ్తారా వేచి చూడాలి

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *