Breaking News

*సోమేశ్వరుడు కి మహా మృత్యుంజయ అభిషేకం*

*సోమేశ్వరుడు కి మహా మృత్యుంజయ అభిషేకం*

*ఘనంగా నిర్వహించిన – వేదపండితులు , బ్రాహ్మణ సంఘాలు*

*విపత్తులు ( సంభవించకుండా ) రాకుండా ఉండాలి అని – ప్రజలు ఆయురారోగ్యాలతో , సుఖ సంతోషాలతో జీవించాలని — మృత్యుంజ అభిషేకం నిర్వహణ*

పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామం లో ని స్వయభూగ వెలసిన శ్రీ ఉమా వాసుకీ రవి సోమేశ్వర స్వామి వారి కి *ఆదివారం* ఉదయం మహా మృత్యుంజయ సహిత ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమం లో వివిధ ప్రాంతాల నుంచి బ్రాహ్మణులు , పండితులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేకం నిర్వహించారు.
*ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి కన్నెర్ర చేసిన విషయం విదితమే.*
అయితే…. *అలాంటి ఘోరమైన ప్రకృతి విపత్తులు* సంభవించకుండా ( రాకుండా ) ఉండాలని ,
ప్రజలు సుఖ సంపత్ సౌభాగ్యలతో జీవించాలని ఈ అభిషేకం నిర్వహించినట్టు కార్యక్రమంలో పాల్గొన్న బ్రాహ్మణులు తెలియజేసారు.
*శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని.*

*”లింగం”* అనే పదానికి *సంకేతం* అని అర్థం.

*అంటే …… శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది.*

*శివలింగము(మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి.*

*బ్రహ్మ భాగము భూమిలో , విష్ణు భాగం పీఠం లొ , శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా ఉంటుంది.*

1. *స్వయం భూ లింగములు అంటే అర్థం :*
*స్వయముగా వాటి అంతట అవే వెలసినవి*

2.• దైవిక లింగములు: అంటే
*దేవతా ప్రతిష్టితాలు.*
3• రుష్య లింగములు:అంటే
*ఋషి ప్రతిష్టితాలు.*

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ వేద పండితులు వేమూరి ఫణీంద్ర శర్మ మాట్లాడుతూ….

మహా మృత్యుంజయ మంత్రం శివుని యొక్క రెండు అంశాలను వివరిస్తుంది. ఒక అంశం ఏమిటంటే మండే మూడు కనులతో ఉన్న దేవుడుని చూపిస్తుంది. ఇంకా రెండవది ప్రకృతి సంతులనంను పునరుద్ధరించడానికి.

మహా మృత్యుంజయ మంత్రం – జపం , *అభిషేకం* చేయుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. *ప్రకృతి కన్నెర్ర చేసిన సమయం లో* మహా మృత్యుంజయ అభిషేకం నిర్వహిస్తే అంతా మంచి జరుగుతుంది.

గాయత్రి మంత్రం వలె మహా మృత్యంజయ మంత్రం పరమ పవిత్రమైనది.
క్షీర సాగన మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు.
ఈ మృత్యుంజయ మంత్రం జపించినా, అభిషేకం చేసిన , చేయించుకున్న వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కానీ , ఆపదల లో ఉన్నపుడు కానీ ఈ మహా మృత్యుంజయ అభిషేకం చెయ్యటం వలన – ప్రకృతి వలన వచ్చే చెడుఫలితాలు తగ్గుతాయి.
మంచి ఫలితాలు పెరగడానికి ఆస్కారం ఉన్నది.
ఈ దేవాలయం లో వెలసి ఆ సోమేశ్వర స్వామి వారికి ఈ మహా మృత్యుంజయ అభిషేకం చేయడం వలన ఘోరమైన ప్రకృతి విపత్తులు , నష్టాల నుంచి బయట పడి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తామని – మహా మృత్యుంజయ అభిషేక విసిష్ఠత ను *ఆలయ వేద పండితులు వేమూరి ఫణీంద్ర శర్మ – తెలియజేసారు.*
*ఈ కార్యక్రమం లో….. ఆలయ అర్చకులు ర్యాలీ. వాసు శర్మ , రామకృష్ణ శర్మ , ఆలయ ఈ.ఓ ప్రసాద్ , ఆలయ సీనియర్ సహాయకులు గణేష్ , వివిధాప్రాంతాల నుంచి బ్రాహ్మణులు పాల్గొన్నారు.*

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *