Breaking News

హార్డ్ వేర్ పరిశ్రమకు అడ్డాగా తిరుపతి

WhatsApp Image 2018-10-04 at 19.15.50 WhatsApp Image 2018-10-04 at 19.15.45 WhatsApp Image 2018-10-04 at 19.15.37 WhatsApp Image 2018-10-04 at 19.15.12

తిరుపతిలో డిక్సన్ కంపెనీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నగరం హార్డ్ వేర్ సిటీగా మారుతుందన్నారు. తిరుపతిని స్పోర్ట్స్ సిటీగా కూడా చేయాలనే ఆకాంక్ష ఉందన్నారు. అత్యాధునిక నగరాలలో తిరుపతిని ఒకటిగా చూడాలన్న చంద్రబాబు మెడికల్ హబ్ గా కూడా తీర్చిదిద్దనున్నామన్నారు. తిరుపతి చుట్టుపక్కల రిజర్వాయర్లలో నీటిని తిరుపతికి అందిస్తామని యువత నైపుణ్యాలు పెంచుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. సీఎం ప్రపంచంలోని తొలి ఐదు నగరాలలో అమరావతి ఒకటిగా చేస్తామన్నారు. అన్ని జాతీయ రహదారులను తిరుపతికి అనుసంధానం చేస్తామన్న అయన ఆలోచనలు, పెట్టుబడితో వస్తే వసతులు మేము కల్పిస్తామన్నారు.తిరుపతిలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ డిక్సన్ కంపెనీ స్థానికులకు ఒక వరం అన్నారు. ఇప్పటికే తిరుపతిలో ఇరవై వేల ఉద్యోగాలు వచ్చాయన్న బాబు డిక్సన్ వలన మరో 1500 ఉద్యోగాలు వస్తాయన్నారు. హార్డ్ వేర్ పరిశ్రమకు తిరుపతి అడ్డాగా మారుతుందన్నారు. ఇంకా ఎక్కువ కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే మా లక్ష్యం అన్నారు. హీరో మోటార్స్ దక్షణాదిలో ఏపీలో మాత్రమే పెట్టుబడులు పెట్టిందని.. కియా మోటార్స్ కు హామీ ఇచ్చి ఆరునెలల్లో నీటి సదుపాయం ఇచ్చామన్నారు. యువశక్తిని పూర్తిగా వినియోగంలోకి తీసుకువస్తామన్న అయన నిరుద్యోగ భృతి అండగా ఉంటుందన్నారు.త్తూరు జిల్లా రేణిగుంటలో సీఎం నారా చంద్రబాబు నాయుడు డిక్సన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. రెండు దశలలో మొత్తం 150 కోట్లతో ఉత్పత్తి ప్రారంభించనున్న ఈ కంపెనీ తొలిదశగా టీవీలు మరియు సెక్యూరిటీ కెమెరాలను తయారుచేయనుంది. తిరుపతి, రేణిగుంటలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్-2 లో ఈ కంపెనీ ఉత్పత్తి చేయనున్నాయి. షావోమీ, పానాసోనిక్, సాన్యో కంపెనీలకు డిక్సన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వస్తువులను తయారుచేయనుంది. రెండవ దశలో మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్ల తయారుకు సన్నాహాలు చేస్తుంది.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *