Breaking News

హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడొద్దు

కరోనా మహమ్మారి ప్రభావంతో మృతుల రేటును తగ్గించడంలో విఫలమై నందుకు యాంటీ మలేరియా డ్రగ్‌, హెచ్‌ఐవీ ఔషధాల ట్రయల్స్‌ను నిలిపేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ తోపాటు హెచ్‌ఐవీని నివారించడానికి వాడే లొపినావిర్‌,రిటోనావిర్‌ ఔషధాల వినియోగించిన కరోనా రోగుల మరణాలు తగ్గలేదని మధ్యంతర ట్రయల్స్‌ నివేదిక తెలిపింది. దీంతో ఆ ఔషధాలను మధ్యంతరంగా నిలిపివేయాలని ట్రయల్స్‌ అధికారులను డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
స్వీడన్‌ లో కరోనా ట్రీట్‌మెంట్‌లో ఈ మెడిసిన్‌ వల్ల వంద మందిలో ఒకరికి గుండె, కిడ్నీలపై ఎఫెక్ట పడింది. దీంతో స్వీడన్‌లోనూ ట్రయల్స్‌లో క్లోరోక్విన్‌ను ఉపయోగించడం ఆపేశారు. పైగా ప్రాణాలు పోయే ఛాన్స్‌ ఉందనే అనుమానాల నడుమ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ను ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించకుండా బ్యాన్‌ చేసింది. అయినప్పటికీ కొన్ని దేశాలు మాత్రం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌తో ట్రీట్‌మెంట్‌ చేస్తున్నాయి. బ్రిటన్‌, ఆస్టేలియాల్లో మాత్రం దీనిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. మనదగ్గర అజిత్రోమైసిన్‌ను కలిపి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగిస్తున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడటం వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స గుర్తించడంతో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *