Breaking News

6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా

6 నెలల నుంచి ఏడాదిలోపు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని వైఎస్.జగన్ ప్రకటించారు. ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ చరిత్రలోనే ఇదొక సంచలన విజయమని చెప్పారు. ఈ విజయం దేవుడి దయ వల్ల, ప్రజలందరి దీవెనలతో సాధ్యమైందని తెలిపారు. ఈ విజయం తన మీద ఉన్న బాధ్యతలను గుర్తిచేస్తోందని పేర్కొన్నారు. విశ్వసనీయతకు ఓటు వేశారని చెప్పారు. ప్రజలకు చెప్పేది ఒకటే.. 5 కోట్ల మందిలో ఒక్కరికీ అవకాశం ఇస్తారన్నారు. ఆ అవకాశం వచ్చినప్పుడు గవర్నెన్స్ ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలోనే ప్రమాణస్వీకారం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *