Breaking News

350 కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి సినిమానా తీసేది…..

“సాహో” ఫలితం ఎలాగూ తేలిపోయింది కాబట్టి అసలు ఆ సినిమా ఎందుకు ఇలాంటి టాక్ తెచ్చుకుంది అని ఆలోచిస్తే నాకు అనిపించిన విషయాలు

ముందుగా భారతీయప్రజల సైకాలజీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ సాంకేతికత కన్నా, అందం కన్నా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. “సాహో” లో ఆ భావోద్వేగం మిస్ అయ్యింది. ట్విస్ట్ లు ఎన్నున్నా. ఏదో ఒక పాత్రతో (ముఖ్యంగా ప్రోటగానిస్ట్ పాత్రతో) ప్రేక్షకుకుడు మమేకం కావాలి లేదా కనీసం కలిసి ప్రయాణించాలి. ఇక్కడ “ఆశోక్” పాత్రతో ముందుగా కొద్దోగొప్పో కనెక్ట్ అయిన ప్రేక్షకుడు . ఫస్టాఫ్ లో అసలు అతను ” ఆశోక్ ” కాదు “సాహో” అని తెలియగానే మొదటి ట్విస్ట్ ఎంజాయ్ చేశాడు. “సాహో” తో కలిసి ట్రావెల్ చేయటానికి రడీ అయ్యాడు. కానీ “సాహో” ఎటెటో ప్రయాణిస్తూ ఉండటంతో ప్రేక్షకుడు మధ్యలో దిగిపోయి (అక్కడే ఆగిపోతే యావరేజ్ గా మిగిలిపొయేది) పూర్తిగా వెనక్కి వచ్చేశాడు. అసలు తాను” ఆశోక్” తో అయినా ఎందుకు ట్రావెల్ చేయాలి అనుకున్నాడు. సో, ప్రేక్షకుడు అసలు ప్రయాణమే చేయొద్దని చెప్పాడు.అసలి ఇదంతా ఎందుకు జరిగిందో ఒకసారి గమనిద్దాం.

కథ బాగా బలిసిన రెండు గ్యాంగ్ స్టర్స్ మధ్య జరిగే కథ.ఈ ఇద్దరిలో ఎవరూ మంచోడు కాదు, కనీసం ప్రజల గురించో, సమాజం గురించో ఆలోచించే వాళ్ళు కూడా కాదు. అసలు సామాన్య ప్రజలకు ఈ కథలో చోటే లేదు, కనీసం ఆ గ్యాంగ్ స్టర్స్ అనుచరులకు కూడా లేదు. ఎవడికీ ఉపయోగపడని. ఎప్పుడూ తన్నుకోవటానికి తప్ప మరెందుకు ఉపయోగపడని ఆ సీట్ కోసం ఇద్దరు తన్నుకుంటుంటే ప్రేక్షకుడు ఎలా కనెక్ట్ అవుతాడు ?? ఇంతకుముందు కూడా ఇలా గ్యాంగ్ స్టర్స్ మధ్య గొడవలతో చాలా సినిమాలు వచ్చాయి. సీట్లో పవర్ ఫుల్ మ్యాన్ కూర్చొని ఉంటే అతన్ని చంపేసి ఆ సీట్ కోసం కొట్టుకోవటం పెద్ద వింతేమీ కాదు, ప్రేక్షకుడి కి నచ్చే అంశం కూడా, కానీ ఆ సీటు లో ఇప్పటికే ఉన్నోడో, లేదా ప్రయత్నించే వాడో, ఎవడోకడు రెండొ వాడికి భిన్నంగా ఉండాలి. కనీసం “మంచి చెడ్డోడు” అయ్యుండాలి. కనీసం రాబిన్ హుడ్ అయ్యిండాలి. లేదా ఎంత చెడు చేసినా, ఎక్కడో ఒక చోట మంచి చేద్దామనే ఆలోచన రావాలి. ( ఉదా ॥ మిగతా గ్యాంగ్ స్టర్స్ అంతా కలిసి ఏ పాకిస్థాన్ కో మద్దతు పలికి, ఇండియా లో బాంబు పేలుళ్ళ కుట్రలు పన్నటం లాంటివి) ఆ చెడు చేయబోయే వాళ్ళతో వీడు పోరాడాలి. అప్పుడు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. కనీసం అది కాకపోయినా విలన్, హీరో వీళ్ళిద్దరి మధ్య మనస్తత్వం లో ఖచ్చితంగా తేడా అయితే ఉండాలి. “సాహో” లో మిస్ అయ్యింది అదే. ప్రోటగానిస్ట్, అంటగానిస్ట్ ( నిజానికి అది చెప్పటానికి కథ పరంగా వీలు కాదు, ప్రభాస్ చేసింది ప్రోటగానిస్ట్ అనుకుంటే ) మధ్య మనస్తత్వంలో కానీ, చర్యల్లో కానీ ఎలాంటి తేడా కనపడదు. మరి ప్రేక్షకుడు ఎందుకు కనెక్ట్ అవుతాడు ??

సాంకేతికంగా సినిమా బాగుంది . ఒప్పుకుంటాను, భారతీయులు చాలా తెలివైన వాళ్ళు. , రూపాయి ఖర్చు పెడితే పది రూపాయల్లా కనపడాలి. దుబారా చేసే వాడిని తెగ తిడతారు. బాహుబలి లో ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెర మీద కన్పించింది. “సాహో” లో అంతా తెరవెనుక మింగేసింది. ప్రేక్షకుడు కి ఏదీ కనపడలేదు. ఈ సినిమా , ఇదే కథ తో ఒక 50 కోట్లతో తీసున్నట్లయితే రిజల్ట్ ఇంకొంచెం బెటర్ గా ఉండేది. 350 కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి సినిమానా తీసేది అనే చిరాకు సినిమాని బాగా దెబ్బేసింది.

( ఇది ఎవరిని కించపరచాలని చెప్పింది కాదు. నటుడిగా ప్రభాస్ ని, దర్శకుడిగా సుజీత్ ని , నిర్మాతలుగా వంశీ, ప్రమోద్ ని గౌరవిస్తూనే… ఒక సినిమా అభిమానిగా మాత్రమే చెప్పాను. )….
……..మోహన్ రావిపాటి………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *