Breaking News

అంత‌ర్జాతీయ చిత్ర‌ప‌టంపై మెరిసిన అమ‌రావ‌తి,,,

అంత‌ర్జాతీయ చిత్ర‌ప‌టంపై మెరిసిన అమ‌రావ‌తి
ప‌ర్యాట‌క శాఖ ప‌టుత్వాన్ని చాటిన వినూత్న కార్య‌క్ర‌మాలు

మొన్న సోష‌ల్ మీడియా స‌మ్మిట్‌
నిన్న ఎఫ్‌1హెచ్‌2ఓ, నేడు ఎయిర్ షో
సిఎం దృష్టిలో నూటికి నూరు మార్కులు
మీనా టీమ్ వెల్‌డ‌న్ అంటూ సిఎం కితాబు

4-26 14711461_1153388378069046_6977805338329554891_o.650x433-364x245 AMARAVATI hqdefault WhatsApp-Image-2018-11-24-at-1.07.05-PM

ప‌ర్యాట‌క రంగ ప‌రంగా అమ‌రావ‌తి అంత‌ర్జాతీయ చిత్ర‌ప‌టంపై మెరిసింది. గ‌త మూడు వారాలుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ రాష్ట్ర‌ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా చేపట్టిన వినూత్న కార్య‌క్ర‌మాలు ఇటు స‌గ‌టు మ‌నిషి మొద‌లు అటు రాష్ట్రాధినేత వ‌ర‌కు అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్నాయి. మొన్న సోష‌ల్ మీడియా స‌మ్మిట్‌, నిన్న ఎఫ్‌1హెచ్‌2ఓ బోట్ రేసింగ్, నేడు ఎయిర్ షో … ఇలా ఈ నెలంతా అమ‌రావ‌తిలో సాగిన ప‌ర్యాట‌క ఉత్స‌వాలు ఆ శాఖ స‌మ‌ర్ధ‌త‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చాయి. ఒక‌ప్పుడు చిరు శాఖ‌గానే సుప‌రిచిత‌మైన ప‌ర్యాట‌క శాఖ ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ముఖ్య మంత్రి చంద్ర‌బాబు నాయిడు ప‌ర్యాట‌క రంగ ప్రాధ‌న్య‌త‌ను గుర్తెరిగి స్వ‌యంగా ఆశాఖ‌ను త‌న‌వ‌ద్దే ఉంచుకున్నారు. నాటి నుండి నేటి వ‌ర‌కు అనిత‌ర సాధ్య‌మైన అంశాల‌ను ఎన్నింటినో సుసాధ్యం చేసిన ప‌ర్యాట‌క శాఖ న‌వంబ‌రు నెల‌లో జ‌రిగిన నిరంత‌ర కార్య‌క్ర‌మాల‌తో జ‌న‌బాహుళ్యానికి మ‌రింత‌గా చేరువ‌య్యింది.

స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ‌తో త‌న బృందానికి మార్గ‌నిర్ధేశ‌క‌త్వం చేయ‌గ‌లిగిన ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా, ముఖ్య‌మంత్రి అండ‌దండ‌లు తోడ‌వ‌గా త‌న‌దైన శైలితో ప‌నిచేసుకుపోయారు. ఫ‌లితంగా వ‌రుస కార్య‌క్ర‌మాలు అద్బుత ఫ‌లితాల‌ను ఇచ్చాయి. సోష‌ల్ మీడియా స‌మ్మిట్ నేప‌ధ్యంలో జాతీయ స్దాయి తార‌లు త‌ర‌లి రాగా, మ‌రో సారి అమ‌రావ‌తికి రావాల‌నుందంటూ వారు స‌రాగాలు పోయారు. ఇక ఎఫ్‌1హెచ్‌2ఓ ప‌వ‌ర్ బోట్ రేసింగ్ అమ‌రావ‌తికి ప‌ర్యాట‌క ప‌రంగా తీసుకు వ‌చ్చిన బ్రాండింగ్ అంతా, ఇంతా కాదు. ఈ రేసుల‌ను లైవ్‌లో చూసిన కోట్లాది మంది దృష్టిలో అమ‌రావ‌తి ఒక అద్బుతంగా నిలిచి పోయిందంటే అతి శ‌యోక్తి కాదు. కోట్లు వ్య‌యం చేసిన ఈ స్ధాయిలో అంత‌ర్జాతీయ‌ ప్ర‌చారం మ‌న‌కు ద‌క్క‌దు. సిఎం దూరదృష్టి ఫ‌లితంగానే ఇది ఆచ‌ర‌ణ సాధ్య‌మైంది. సిఎం ఆలోచ‌న‌ల‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క సాధికార సంస్ధ సిఇఓ హిమాన్హు శుక్లా అధికారుల‌ను ప‌రుగులు పెట్టించారు. వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యం తీసుకున్నారు. చిరుద్యోగి మొద‌లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌ర‌కు అంద‌రినీ ప‌ర్యాట‌క పండుగ‌ల‌కు స‌మాయ‌త్తం చేసారు. వీరిలో కొంద‌రు ప‌నిచేసే వారు, మ‌రి కొంద‌రు ప‌ర్య‌వేక్షించేవారు. అంతిమ ఫ‌లితం అవిష్కుత‌మైంది. స‌గ‌టు వీక్ష‌కుల ఆనందం అంబ‌రాన్ని అంటింది. నిజానికి మీనాది ఆలోచన అయితే శుక్లాది ఆచ‌ర‌ణ. శుక్లా తాను ఐఎఎస్ అన్న విష‌యం ప‌క్క‌న పెట్టేసారు. స‌గ‌టు ఉద్యోగి సైతం అలా క‌ష్ట‌ప‌డ‌రేమో. దాదాపు నెల‌రోజులు క్షేత్ర‌స్ధాయిలో ప‌నిచేసారు. ఏ అంశం ఆయ‌న దృష్టిని దాటి పోలేదు. సుశిక్షితులైన సైనికుల మాదిరి సిబ్బంది ప‌నిచేసేలా, శుక్లా నిత్యం దిశా, నిర్ధేశం చేస్తూ వ‌చ్చారు. ఫ‌లితంగానే ఆద్బుతాలు ఆవిష్కుత‌మ‌య్యాయి.

తాజాగా ఈ ఆదివారం ముగిసిన ఎయిర్‌షో సైతం న‌గ‌ర వాసుల‌ను పుల‌కింప చేసింది. వ‌రుస‌గా ఐదు రోజులు లోహ విహంగాలు చేసిన విన్యాసాల‌తో న‌గ‌ర వాసులు స‌మ్మోహితుల‌య్యారు. ప్ర‌త్యేకించి యువ‌త అటు బోటు రేసులు, ఇటు విమాన విన్యాసాల‌ను చూస్తూ వినోదాన్ని పొంద‌ట‌మే కాక సాంకేతిక‌త ప‌రంగా జ‌రుగుతున్న మార్పుల‌పై చ‌ర్చించుకోవటం విశేషం. ఎయిర్ షో తుది కార్య‌క్ర‌మంలో సిఎం మాట్లాడుతూ మీనా నేతృత్వంలోని ప‌ర్యాట‌క బృందం అద్బుతంగా ప‌నిచేసిందంటూ నూటికి నూరు మార్కులు వేయ‌టంతో ఆ శాఖ సిబ్బంది ఆనందానికి అవ‌ధే లేదు. వ‌రుస కార్య‌క్ర‌మాల‌తో వారిలో నెల‌కొన్న బ‌డ‌లిక ఒక్క సారిగా ఎగిరి పోయింది. వ‌చ్చే వారామే మ‌రో కార్య‌క్ర‌మం పెట్టినా ప‌ర్యాలేదంటూ వారు త‌మ ఆనందాన్ని అధికారుల‌తో పంచుకున్నారు. సిఎం సైతం అమ‌రావ‌తి వాసుల ఆనంద‌మే ప‌ర‌మావ‌ధిగా ఇక‌పై నిరంత‌ర కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేసారు.

వ‌రుస కార్య‌క్ర‌మాల ప‌రంగా చిన్న పొర‌పాట్లు జ‌రిగినా అవి వెంట‌నే స‌ర్ధుకున్నాయి. ప‌ర్యాట‌క కార్యద‌ర్శి మీనా బెరంపార్కులోనే క్యాంపు కార్యాల‌యం ఏర్పాటు చేసుకుని ఇబ్బందుల‌ను చ‌క్క దిద్దుతూ నిరంత‌ర సూచ‌న‌ల‌తో సిబ్బందిని ముందుకు న‌డిపించారు. ఇటు జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మి కాంతం, అటు న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ ద్వార‌కా తిరుమ‌ల రావు, విజ‌య‌వాడ మున్పిప‌ల్ క‌మీష‌న‌ర్ నివాస్‌ త‌దిత‌రులు త‌మ వంతు స‌హ‌కారం అందించ‌గా, వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్ల ప‌రంగా ప‌ర్యాట‌క శాఖ‌కు త‌మ స‌హ‌కారాన్ని అందించారు. ఇక్క‌డ ప్ర‌సావించ‌వ‌లసిన మ‌రో అంశం ఏమిటంటే అటు వ‌ర్షాన్ని ఇటు ఎండ‌ను లెక్క చేయ‌కుండా జ‌నం త‌ర‌లి రావ‌టం. ఎఫ్1హెచ్‌2ఓ తొలిరోజు వ‌ర్షం ఆందోళ‌న క‌లిగించినా కార్య‌క్ర‌మం స‌జావుగా ముగిసింది. ఎయిర్‌షో ప‌రంగా ఎండ ఇబ్బంది పెడుతున్నా ప‌ర్యాట‌క శాఖ అందించిన క్యాప్‌లు, గొడుగుల ఆస‌రాతో అమ‌రావ‌తి ప్ర‌జ‌లు ఆనంద డోలిక‌ల్లో వినూత్న అనుభూతిని పొంద‌గ‌లిగారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *