Breaking News

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ చేయుత..

మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో జరిగిన మూడు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు శనివారం మచిలీపట్నం లోలంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు వితరణ కార్యక్రమం నిర్వహించారు..

ఈ నెలలో అరిసేపల్లి గ్రామానికి చెందిన వక్కలగడ్డ జయలక్ష్మి( 62), సాక్షి సావిత్రి( 59 )మరియు పెడన 22 వ వార్డు కు చెందిన చల్లా శ్యామల రావు (48) చెందిన మూడు నివాస గృహాలు విద్యుత్, గ్యాస్ లీకేజ్ వలన పూర్తిగా భస్మీపటలం అవ్వడం జరిగింది..సుమారు 4 లక్షల ఆస్థి నష్టం జరిగింది…

లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ 15వార్డు మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు సుమారు 20 వేల రూపాయలు ఖరీదు చేసే నిత్యవసర వస్తువులు, బట్టలు, బియ్యం,వంటసామాగ్రి మూడు వేల రూపాయలు నగదును అందజేశారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా పక్కా ఇళ్లు నిర్మించి బ్యాంకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కు బాలాజీ విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు అందజేస్తున్న ప్రభుత్వ సహాయం ఏ మాత్రం సరిపోవడం లేదని కనీసం లక్ష రూపాయలు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అంద చేయవలసిన అవసరం ఉందని బాలాజీ అన్నరు.

విజయ్ కృష్ణ జన జాగృతి సంస్థ కన్వీనర్ శికినం కాళిదాసు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అగ్ని బాధిత కుటుంబాలకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చేయుత ఇస్తుందని అన్నారు.

విశ్రాంత ఉపాధ్యాయులు ఏ .నాగరాజు మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని అన్నారు. వృద్ధాప్యంలో సర్వస్వం కోల్పోవడం అత్యంత అధిక బాధాకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో లంకిశెట్టి సాయి బాబు న్యాయవాదులు తాతా గోపి, జొన్నలగడ్డ నాగరాజు,, మల్లంపల్లి వీర వెంకట రామాంజనేయులు బాబు, తాడేపల్లి రమేష్, చలువది వెంకట లీలా కోటేశ్వరరావు,చింతల పెద్ద కొండయ్య, చంద్రకళ తదితరులుపాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *