Breaking News

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

అగ్రిగోల్డ్‌ బాండ్ల వెరిఫికేషన్‌కు హైకోర్టు మళ్లీ మూడు నెలల సమయం ఇవ్వడం వల్ల బాధితులు మరింత ఆందోళనకు గురవుతున్నారని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు. నూతన ముఖ్యమంత్రి బాధితులకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామన్నారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రూ.1180 కోట్లను విడుదల చేస్తామని వైసీపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారని, ప్రచారంలో వైఎస్‌ జగన్‌ అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన మాటల్ని పూర్తిగా విశ్వసిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి తన వాగ్దానాన్ని నిలుపుకొని మూడు నెలల కాలంలో రూ. 20 వేల లోపు ఉన్న డిపాజిట్‌ దారులకు డబ్బు చెల్లించడం, కోర్టు అటాచ్‌మెంట్‌ చేసిన కంపెనీ ఆస్తులను కోర్టు పర్యవేక్షణలో వివిధ జిల్లాలలో ఏకకాలంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నాగేశ్వరరావు కోరారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి మెమొరాండం అందజేస్తామని చెప్పారు. బినామీ పేర్లతో అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *