ఎవరైనా ఏ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు లైనా చట్ట సభలలో వాళ్ళు చేసిన ప్రతిజ్ఞకు భిన్నంగా వ్యవహరిస్తూ రాగ ద్వేషాలతో అసభ్య పదజాలం ఉపయోగిస్తే ఆటు వంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయటం జరుగుతుందని కృష్ణా జిల్లా కు చెందిన భవిష్యత్ భద్రతా దళం వై.వి.మురళీ కృష్ణ అన్నారు .గుడివాడలో అయన మాట్లాడుతూ ఆటు వంటి వారి సభ్యత్వాన్ని రద్దు చేయలని అన్నారు ,అవసరమైతే న్యాయం కోసం న్యాయ స్థానం లో పోరాటం చేస్తామన్నారు. ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టవలసిందిగా ప్రజా ప్రతినిధులను మురళీ కృష్ణ కోరారు .