Breaking News

ఈ స్థాయి వర్షాలను ఎప్పుడూ చూడలేదు: జగన్

రాయలసీమలో జలాశయాలు పూర్తిగా నిండాయని సీఎం జగన్‌ అన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల్లో వరద ప్రాంతాలను సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం వరదలపై నంద్యాలలో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయలసీమలో ఈ స్థాయి వర్షాలను ఎప్పుడూ చూడలేదన్నారు. అనంతపురం మిగహా అన్ని చోట్ల వర్షాలు కురవడం శుభ పరిణామమని చెప్పారు. వరద బాధితుల పట్ల అధికారులు మానవత్వం చూపాలని కోరారు. గోదావరి నీళ్లు రాయలసీమ కు తరలించేందుకు కేసీఆర్‌తో చర్చించడం జరిగిందని తెలిపారు. నంద్యాల డివిజన్‌లోని 17 మండలాల్లో నష్టం జరిగిందని స్పష్టం చేశారు. 43 వేల హెక్టార్లలో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. రూ.784 కోట్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. వరదలు రాకుండా కలెక్టర్లు శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.2 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. వరద బాధితులకు గతం కంటే 15శాతం అదనంగా ఇస్తామన్నారు. వరద బాధితులకు ముందుగా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *