Breaking News

ఉత్తర ప్రదేశ్ లో కమలోదయం

yogi

 

 

 

 

 

 

 

 

 

 

 

దేశం అంతా ఉత్కంఠ గా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు మిగిశాయి,  స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ, ఎవ్వరూ  తీసుకోలేని సాహసోపేత నిర్ణయమైన నోట్ల రద్దు తర్వాత జరిగిన ఎన్నికల కావటం వల్ల మరింత ప్రాధాన్యత సంతరింఛుకున్నాయి. దేశంలొ అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు పరిణామాలను, ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం

 దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా 403 అసెంబ్లీ సీట్లతో , దేశ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక రాష్ట్రం, దేశానికి ఎక్కువ మంది ప్రధానమంత్రులను అందించిన రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ . అత్యంత క్లిష్టమైన రాజకీయ సమీకరణలతో కూడి ఉంటుంది. దాదాపు 200 కులాలు కొలువై ఉన్న ఉత్తరప్రదేశ్ లో, రాజకీయాలు ఎప్పుడూ కులం చుట్టూనే తిరుగుతుంటాయి, దానికి తోడు 18 %  ఉన్న ముస్లిం జనాభా కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఇంత సంక్లిష్టతలతో కూడుకున్న ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీకైనా గెలుపు నల్లేరు మీద నడక కాదు. ఎప్పుడూ ఎలాంటి వేవ్ అక్కడ కన్పింఛదు. ఎవరు గెలిచినా, ఎవ్వరూ ఓడినా అతి తక్కువ మెజారిటీలతోనే. ఎక్కువగా బహుముఖ పోటీలు ఉంటాయి. ఎవరు గెలుస్తారో చెప్పటం చాలా కష్టం.అత్యంత నిపుణులతో కూడిన సర్వే సంస్థలు కూడా అక్కడి ప్రజల నాడిని పట్టలేవు.మొత్తం మీద ఎవరి అంఛనాలకు అందని విధంగా బిజెపి 300 సీట్లకు పైనే గెలిచి సంచలనం సృష్టించింది. 1977 తర్వాత (ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్ లతో కూడిన ఉత్తరప్రదేశ్) ఆ మార్కు దాటింది. నిస్సందేహంగా బిజెపి ని ఇందుకు అభినందింఛాల్సిందే. ఇందుకు దోహద పడిన అంశాలను పరిశీలిద్దాం
 
1) సమాజ్ వాదీ పార్టీ లో ఏర్పడిన చీలిక :  నాలుగు సంవత్సరాల పాటు అధికారం అనుభవించి, చివరిలో కుటుంబంలో ఏర్పడిన చీలిక, బిజెపి గెలుపుకి దోహద పడిన అంశాల్లో ఒకటి. నిజానికి సమాజ్ వాదీ పార్టీ , అన్ని ప్రాంతీయ పార్టీల్లా కుటుంబ పార్టీనే. దానితో కుటుంబంలో వచ్చిన చీలిక పార్టిలో కూడా చీలిక కు దారి తీసింది, సాంకేతికంగా అఖిలేష్ యాదవ్ పార్టిని చేజిక్కుంచుకున్నా తండ్రి మీదే తిరుగుబాటు చెయ్యటం, బాబాయ్ ని పార్టీనుండి బహిష్కరించటం లాంటి సమస్యలు ఎన్నికలకు కొద్దిగా ముందే రావటంతో, పార్టీ క్యాడర్ గందరగోళానికి గురైంది. వాళ్ళ దృష్టి అంతా పార్టీలోని సమస్యలో ఎవరి పక్కన నిలుచోవాలో అనేదాని మీదే ఉంది కానీ, ఎన్నికలకు సమాయుత్తం కాలేక పోయింది
 
2) సమాజ్ వాదీ- కాంగ్రెస్ పొత్తు : నిజానికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లశాతాన్ని లెక్కేసుకొని, ఆ ఓట్ల శాతం ఖచ్చితమైన ఓట్లని, ఆ ఓట్లు తమ పార్టీకి యాడ్ అయితే అది తప్పని సరిగా విజయాన్ని సాధించగలమనే నమ్మకంతో సమాజ్ వాదీ పార్టీ , కాంగ్రెస్ తో పార్టీ తో పొత్తు పెట్టుకుంది, నిజానికి ఇదీ పూర్తిగా పేపర్ మీద ఉన్న ఫిగర్స్ ని చూసి అదే నిజమని నమ్మటం లాంటిది, క్షేత్ర స్థాయిలో అసలు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అన్న దాని మీద ఎలాంటి అంచనా లేదు. కాంగ్రెస్ పార్టీకున్న ఓట్ల శాతం సాంప్రదాయంగా చేతి గుర్తుకి ఓటు వేయటానికి అలవాటుపడిపోయినవారు ( సంఖ్యలో తక్కువే కావచ్చు) , అందుకే కాంగ్రెస్ ఓట్లు ఏమాత్రం సమాజ్ వాదీ పార్టీకి బదిలీ కాలేదు. పైపెచ్చు కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేదు. అసలు ఆ స్థాయి నాయకులు కూడా లేరు. దానితో కాంగ్రెస్ పార్టీ ఓటు, సమాజ్ వాదీకి ఎలాంటి ప్లస్ కాలేకపోయింది.  ఇక కాంగ్రెస్ కి వంద సీట్లు ఇవ్వటం మరో తప్పిదం. అధికారంలో ఉన్న పార్టీ, అంతక్రితం ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీ తో పొత్తు పెట్టుకోవటం వ్యూహాత్మకంగా చాలా పెద్ద పొరపాటు. అంటే పరోక్షంగా తన మీద తనకుపూర్తి నమ్మకం లేకపోవటమే, ఇది సమాజ్ వాదీ క్యాడర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది . ఎప్పుడైనా ప్రతిపక్షాలన్నీ ఏకమై పాలకపక్షాన్ని ఓడింఛాలని చూస్తాయి కానీ, ఇక్కడ విచిత్రంగా పాలకపక్షం ఇంకో ప్రతిపక్షాన్ని కలుపుకొని,   మరో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలని చూడటం అంటే, తనకన్నా తాను ఎదుర్కోబోయే ప్రతిపక్షం బలంగా ఉంది అని ఒప్పుకోవటమే, తద్వారా ఎన్నికలకు ముందే సమాజ్ వాదీ పార్టీ, తన ఓటమిని ఒప్పుకున్నట్లయింది.దీనితో బిజెపికి నైతికంగా బలం వచ్చినట్లయింది
 
3)  డీమానిటైజేషన్ ః నిజానికి ఇది విచిత్రపు సమస్య. ఇది బిజెపి కేంద్రప్రభుత్వం తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం, దీని ఫలితాలు ఎలా ఉంటాయో, ఉండబోతాయో స్పష్టంగా తెలియకపోయినా, కొంత మంది స్వాగతించారు, మరికొంత మంది దాన్ని నిరసించారు, కానీ, ఈ నిరసన తెలిపే క్రమంలో ప్రతిపక్షాలు చేసిన ప్రచారం , బిజెపి కి నష్టం కలిగించకపోగా, మరింత లాభాన్ని తెచ్చింది. ఆ రెండు నెలల్లో ప్రజలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, కానీ దాని ప్రతిపక్షాలు కానీ, వారికి వత్తాసు పలికిన మీడియా కానీ సరైన రీతిలో ప్రొజెక్ట్ చెయలేకపోయాయి. నిజానికి దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడిన ప్రతివారికి, అన్ని విధాలా అతనికన్నా పై స్థాయిలో ఉన్నవాడు కూడా ఇబ్బంది పడటం కన్పించింది. ఇది నిజానికి వాళ్ల ఇగోని సాటిస్ ఫై చేసింది. అందుకే చాలా మంది మోదీ మంచి పని చేశాడ్రా అనుకోవటం మనకు కన్పించింది. వాడు ఇబ్బండి పడుతున్నా, తనకన్నా పై వాడు కూడా అదే ఇబ్బండి పడుతుంటే వీళ్ళకు అదొక తృప్తి,( it’s a psychological theory) . అదే సమయంలో నోట్ల రద్దు వల్ల ఏదో జరగబోతుంది అనే ఒక ఉత్సుకతను , దాని ద్వారా మంచి జరుగుతుంది, అనే అభిప్రాయాన్ని కలుగజేయటంలో మోదీ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. జనాల సైకాలజీని గమనించి మోదీ ముందుకెళ్తే , మోదీని వ్యతిరేకించి ప్రతిపక్షాలు ప్రజల దృష్టిలో పలుచన అయ్యాయి
 
4) సమాజ్ వాదీ పార్టీ మీద ఆరోపణలు ః నిజానికి అఖిలేష్, ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే చాలా బాగానే పని చేశాడు. కానీ విపరీతమైన గూండారాజ్యాన్ని నిర్మూలింఛలేకపోయాడు. అటు ములాయంలా గూండా రాజ్యాన్నే నమ్ముకోలేదు, లేదా సచ్చీలుడైన రాజకీయనాయకుడిగా గూండారాజ్యాన్ని నాశనం చెయ్యాలని చూడలేదు. ఆ రెండిటి మీద కాలు పెట్టి నడవాలని ప్రయత్నింఛాడు. దానితో అటు గూండారాజ్యంలో అధికారం చెలాయించేవాళ్ళు  అఖిలేష్ ని నమ్మలేదు, ఇటు సచ్చీల రాజకీయాలను అభిలషించేవాళ్లు అఖిలేష్ ని నమ్మలేదు. 
 
5) దెబ్బతిన్న బి.యస్.పి ః ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లోనే కాక, మిగతా దేశం మొత్తం కూడా విస్తరిస్తూ, సాంప్రదాయక పార్టీలను  భయపెట్టిన బి.యస్.పి దాని అధినేత్రి మాయవతి, ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 2012 ఎన్నికల్లో మొదలైన దాని పతనం మరింత దిగజారింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో  ఇంకా కిందకి, ఇప్పుడు మరింత కిందకీ దిగజారింది. దీనికి కారణం ఎక్కువ మాయవతి స్వయంకృతాలే. నిజానికి ఆమెని కానీ, బి.యస్.పి ని కానీ దళితులతో పాటు, బి.సి..వర్గాలుకూడా ఆదరించాయి, కాని అధికారంలోకి వచ్చాక, అవినీతి ఆరోపణలు, డబ్బుల దుబారా దళితులు భరించలేకపోయారు, ఈ పార్టీ కూడ మిగతా పార్టీలకు నకలు గా మారటం జీర్ణించుకోలేకపోయారు, దానికి తోడు బి.యస్.పి సోషల్ ఇంజనీరింగ్ అనుకొని తీసుకువచ్చిన దళితులు + బ్రాహ్మణులతో కల్సి అధికారం అనే ఫార్ములా మొదటి సారి సక్సెస్ అయినా 2012 కే ఎదురు తిరిగింది. మనకున్న కుల సంక్లిష్టతల వల్ల ఆ రెండు వర్గాలు ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి వచ్చింది. మన పార్టీ అనుకున్న బి.యస్.పి బ్రాహ్మణులను దగ్గరకు తీసుకోవటాన్ని దళితులు అస్సలు సహించలేకపోయారు. 
 
ఏమైనా, బిజెపి మాయని, మిగతా పార్టీలు ఊహించలేకపోయాయి. బిజెపిని ఎంతగా హిందూ మతతత్వ పార్టీ అని మిగతా పార్టీలు ప్రాపగాండా చేస్తుంటాయో, అంత బిజెపి కి ఓటు బ్యాంకు ని పెంచుతున్నాం అనే విషయాన్ని మిగతా పార్టీలు తెలుసుకోవాలి. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో బిజెపి 300 సీట్లు పైగా గెలుచుకుంది అంటే దానికి కారణం హిందూ ఓట్లు పోలరైజ్ కావటం ఖచ్చితంగా ఒక కారణం, కానీ విచిత్రంగా ఇలా పోలరైజ్ కావటానికి కారణం మాత్రం బిజెపియేతర పక్షాలే 
 ఇక ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంచుకుంటుందో చూడాలి   బహుశా హోమ్ మినిష్టర్ రాజ నాద్ సింగ్, టెలికామ్ మినిష్టర్ మనోజ్ సిన్హా, వెనుకబడిన కులాల ప్రతినిధిగా జలవనరుల శాఖా మంత్రి,  ఉమాభారతి లు మాత్రమే కాకుండా, బిజెపి ఉత్తర్ ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ( బి.సి కులానికి చెందిన వ్యక్తి కావటం ఒక ప్లస్.  ఎలాంటి అనుభవం లేకపోవటం మైనస్ ) లతో పాటు,  టూరిజం మినిష్టర్  మహేష్ శర్మ పోటి పడుతున్నారు, వీళ్ళందరి తో పాటు వివాదాస్పద నాయకుడు.  హిందూత్వ వాది యోగీ ఆదిత్యనాధ్ కూడా  రేసులో ఉన్నారు.  మరి వీళ్ళందరిలో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి. 
 
మోహన్.రావిపాటి
9000864857
 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *