Breaking News

ఎన్డీయే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది: కిషన్‌రెడ్డి

ఎన్డీయే అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది లేకుండా దేశాన్ని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారు. గతేడాది కంటే 9 శాతం ఎగుమతులు పెరిగాయన్నారు. 331 బిలియన్‌ డాలర్లకు ఎగుమతులు చేరుకున్నాయన్నారు. జాతీయ రహదారులు 1.32 లక్షల కి.మీ.కు చేరుకున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

రోజుకు సరాసరి 30 కి.మీ. రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒకే దేశం – ఒకే పవర్‌ గ్రిడ్‌ నినాదంతో ముందుకెళ్లామన్నారు. సంస్కరణలతో వేగం పెరిగిందని… సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో ఎన్నో వర్గాల వారికి ఊరట లభించిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *