Breaking News

ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నాం: పవన్‌

 

అన్యాయంపై గళమెత్తడానికే జనసేన స్థాపించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మార్పు కోసమే మీ ముందుకు వచ్చాను. పాతికేళ్లు భవిష్యత్ కోసమే మీ ముందుకు వచ్చాను. మానవత్వమే మనను కలిపిందని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. పోరాట యాత్రలో వైకాపా తప్పొప్పుల్ని ఎత్తి చూపానని, తెలుగేదేశం పై విమర్శలు చేశాను, ఇప్పుడు జనసేన ఏం చేయబోతున్నదని చెబుతానని పవన్ కల్యాణ్ అన్నారు.ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్ స్పష్టం చేశారు. రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌లో చదువు ఆపేసినా… చదవడం ఆపలేదన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని, కానిస్టేబుల్‌ ఇంట్లో పుట్టిన ఓ వ్యక్తి 2019లో సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. గెలుపోటములు తెలియదు… యుద్ధం చేయడమే తెలుసన్నారు. సీఎం పదవిపై కోరిక లేదని, అందలం ఎక్కాలని ఆశ లేదని చెప్పారు. పవర్‌స్టార్‌ పదంపైనే ఆసక్తి లేదని, సీఎం పదవిపై ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. అన్యాయంపై గళమెత్తేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌కల్యాణ్ చెప్పారు.గెలుపు ఓటముల గురించి తనకు తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు.

 తనకు తెలిసనది పోరాటమే అని ఆయన అన్నారు. తన దగ్గర టీవీలు, పేపర్లూ లేవనీ, వేల కోట్లు లేవనీ, కానీ ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *