తెలుగుదేశం పార్టీ ఒక ఎమోషన్ ఆధారంగా పుట్టిన పార్టీ.. ఇప్పటివరకు ఆ ఎమోషన్ వీక్ అయినప్పుడంతా ఆ పార్టీ ఓడిపోయింది. కానీ, ఈ సారి ఓడిపోయింది అందుకు కాదు. తెలుగుదేశం ఇప్పుడు ఎమోషన్ నుండి ఒక పూర్తి స్థాయి పార్టీ గా మారుతున్న క్రమం, ఈ పరిణామ క్రమంలో సహజంగా పార్టీ రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. తిరిగి పుంజుకుంటుంది. ఎమోషనల్ అటాచ్మెంట్ నుండి థియారాటికల్ అటాఛ్మెంట్ గా మారే క్రమంలో పార్టీ తెలియకుండా చాలా వత్తిడి కి లోనవుతుంది ( ఇదో భూకంపం లాంటీది..వచ్చేవరకు తెలియదు). ఈ పరిస్థితి తెలుగుదేశం కే కాదు, అన్ని పార్టీలకు వస్తుంది, 69 లో కాంగ్రెస్ కీ వచ్చింది. కాకపోతే, అప్పుడు అది పార్టీ లో అంతర్గత సర్దుబాటు తో కుదురుకుంది , దానికి కూడా కారణం లేకపోలేదు, అది దేశమంతా విస్తరించి ఉండటంతో పరిధి పెద్దగా ఉండి సర్ధుకుంది.
తెలుగుదేశమొక్కటే కాదు,తెరాస కూడా అంతే, అది పూర్తిగా ఎమోషనల్ బేస్డ్. ఆ ఎమోషన్ ఒక జనరేషన్ వరకూ ఉంటుంది, ఆ ఎమోషన్ పీక్స్ లో ఉంటే గెలుస్తుంది, తగ్గితే ఓడిపోతుంది. మరో ఇరవైఏళ్ళ తర్వాత తెరాస కూడా ఇలాంటి దారుణ పరాభావాన్ని ఎదుర్కోక తప్పదు.
ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న ఎమోషన్ జాతీయత. ఇందుకే బిజెపి గెలుస్తుంది. కాకపోతే అత్యంత వీక్ ఎమోషన్ కూడా అదే అది ఎక్కువకాలం అస్సలు నిలబడదు, అందుకే వాళ్ళు మరో ఎమోషన్ ని ప్యారలల్ గా పెట్టుకున్నారు. అది మరింత ప్రమాదకరమైన ఎమోషన్. అది మనిషికి ఎంత వేగంగా కిక్ ఇస్తుందో అంతే వేగంగా దిగిపోతుంది, అదే మతతత్వం . బిజెపి ఇక్కడే తెలివిగా ఆలోచించింది, ప్రతిపక్షాలు ఆ రెండు ఎమోషనల్ అంశాల మీదే పదేపదే విమర్శలు చేసేలా దేశమంతా ఒక గ్రౌండ్ సృష్టించుకుంది. దాంతో అన్నిపక్షాలు ఆ ట్రాప్ లో పడ్డాయి. అవి ఆ ట్రాప్ లో నుంచి బయటకు రావాలంటే ఏదోక పక్షం సహాయం కావాలి. బ్యాడ్ లక్ ఒక్క పార్టీ కూడా ఆ ట్రాప్ లో పడకుండా మిగల్లేదు.
ఒక తమిళనాడు మాత్రమే ఇప్పటివరకు ఈ ఎమోషన్స్ కి లోబడి లేదు. అక్కడ పార్టీ సిద్దాంతాలు మాత్రమే పనిచేశాయి , రెండు పార్టీల సిద్దాంతమొకటే కావటం దానికి దోహద పడింది. ఎప్పుడైతే ఒక పార్టీలో శూన్యత ఏర్పడిందో ఆటోమాటిగ్గా అది కూడా ఎమోషనల్ ట్రాక్ లోకి వచ్చేసింది.తాత్కాలికంగా ఇది అక్కడ ఉన్న ఏకైక పార్టీ అయిన డియంకె కి ఉపయోగపడవచ్చు, కానీ ఆది కూడా ఎక్కువ కాలం నిలబడదు. అందరూ కేరళలో కూడా బీజేపీ బలపడదు అనుకుంటున్నారు, కానీ, అది నిజం కాదు. అక్కడ శబరిమలై ఇష్యూ బిజెపి వేసిన ట్రాప్, అన్ని పక్షాలు చిక్కుకున్నాయి. దాని ప్రభావం మరో మూడేళ్ళలో అర్థమవుతుంది
ఫైనల్ గా తెలుగుదేశం, వైసిపి, తెరాస ఉ మూడు బలంగా ఉండటం మనకు అదృష్టం. వీటిలో తెదేపా మొదటిస్థాయిని దాటింది. కాబట్టి అది ఎమోషనల్ నుండి ఎదిగి సైద్ధాంతికత ఆధారంగా ప్రజలను ఆకట్టుకోవాలి. తెరాస, వైకాపా లు ఎమోషన్ ఆధారంగా ప్రజలను ఆకట్టుకోవచ్చు. కెసిఆర్ తెదేపా ని ఇక్కడ ఎదగనీయకుండా ఆపటం వ్యూహాత్మకంగా చాలా తప్పు. సైద్దాంతికంగా తెదేపా తో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకులు. అలాంటి వాళ్ళందరూ బిజెపి వైపు మళ్ళే అవకాశం ఉంది. అది బిజెపి కి చాలా బలంగా మారుతుంది. అది తెరాస ని తేలిగ్గా మింగేస్తుంది. ప్రస్తుతానికి వైకాపా బలంగా ఎదగటం ఎపికి మంచిదయ్యింది. కాకపోతే వైకాపా బిజెపి కి చోటు ఇవ్వకూడదు. ఇక్కడ అదృష్టం ఏంటంటే వైకాపా ఎమోషన్, బిజెపి ఎమోషన్ పూర్తిగా వ్యతిరేకాలు. ఆంధ్రప్రదేశ్ కు ఒక సైద్ధాంతిక పార్టీ,, ఒక ఎమోషనల్ పార్టీ ఉండటం మంచిదే అయ్యింది. వైకాపా కూడా సైద్దాంతికంగా తెదేపా నే. ఇవి రెండు బలంగా తమ సిద్దాంతాన్ని ప్రజలకు వినిపిస్తే మరో పాతికేళ్ళు బీజేపీ ని రానివ్వవు..ఆ తర్వాత బిజెపి ఉండదు
ఒక రిటైర్డ్ పొలిటికల్ ప్రొఫెసర్ తో ఈ రోజు సాయంత్రం…
ఆయన చెప్పినదానిలో కొన్ని పాయింట్స్ మాత్రమే రాశాను.-మోహన్ రావిపాటి ……..