Breaking News

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

 

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ రమేష్ కుమార్ సమావేశంలో మాట్లాడారు.

అత్యవరస పరిస్దితుల్లో కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఉండే హక్కులు రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఉంటాయి

విధిలేని పరిస్దితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆరువారాలు నిలిపివేస్తున్నాం.. ఈ రోజుల్లో ఎన్నికల కోడ్ యధాతధంగా అమలులో ఉంటుంది.

 

పంచాయితీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేయాల్సింది, సాధారణ పరిస్థితి ఏర్పడిన తదుపరి ఎన్నికల కమిషన్ విడిగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుంది. ఆరువారాల తరువాత పరిస్థితి సమీక్షించి పంచాయితీ షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ఎన్నికలకు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంటుందని పలు పార్టీలు, సామాజిక సంఘాలు పలు సందర్భాల్లో పేర్కొనడం జరిగింది.  కరోనా ప్రభావం పై పూర్తిస్ధాయిలో విచారణ చేసామని,, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. మనుషులకు మనుషులు తగిలే అవకాశం ఎక్కువ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ముప్పు తప్పడం లేదు. ఎన్నికలు జరపడం ముఖ్యమైనా, ప్రజాభద్రతను పణంగా పెట్టకూడదనే వాదనతో ఎన్నికల కమిషన్ ఏకీభవిస్తుంది. కానీ, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగానో, పాక్షికంగానో పూర్తయ్యాయి. అనేక వ్యయ ప్రయాసలను అధిగమించి ఏర్పాట్లు చేపట్టాం. సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు చేశాం. కానీ, విధిలేని పరిస్థితుల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో రాజ్యాంగం ద్వారా, పంచాయతీ రాజ్ చట్టం ద్వారా సంక్రమించిన విస్తృతమైన, విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ రద్దు కాదన్నారు.

 

ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతా రన్నారు. ఆరు వారాల తర్వాత సమీక్ష తర్వాత వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీలకు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లు అవసరమైన మేరకు సవరిస్తామన్నారు.  పంచాయతీ ఎన్నికలకు ఆరు వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు.

బ్యాలెట్ పేపర్ వాడడం వల్ల ఓటుకి ఎక్కువ సమయం పడుతుందని, చాలా సేపు క్యూలో నిలబడాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే యంత్రాంగం పూర్తి సన్నద్ధం గా ఉన్నాము. ప్రధాని కరోనా విషయంపై అత్యాయక పరిస్థితి గా పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు యదార్థ స్థితిలో నిలిపివేత మాత్రమే నని, రద్దు కాదని ప్రకటన జారీచేశారు.  ఆరువారాల తరువాత సమీక్ష అనంతరం ఎన్నికలు పై ప్రకటన విడుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఏకగ్రీవం అయిన వాటికి ఎన్నికలు ఉండవన్నారు. నామినేషన్ వేసిన వారిని భయబ్రాంతులకి గురిచేయకూడదని, స్వేచ్ఛ, పారదర్శకంగా ఎన్నికల ను నిర్వహించడం కమిషన్ బాధ్యత అన్నారు.

ఎన్నికల సంఘటనలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని తెలిపారు. గ్రామవాలంటీర్ లపై అనేక ఫిర్యాదు వస్తున్నాయన్నారు. ప్రజల, ఉద్యోగుల వ్యక్తిగత, ఆరోగ్య భద్రత కూడా ముఖ్యమని, కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే అన్ని స్కూళ్లు, మాల్స్ మూసేశారన్నారు. ఎంపీపీ, జడ్పీటిసి నామినేషన్స్ లో జరిగిన హింసాత్మక ఘటనలను ఈసీ తీవ్రంగా పరిగణిస్తోందని  నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్టు భావిస్తున్నామన్నారు. అధికారులు ప్రేక్షక పాత్రను పోషిచడం దారుణం అన్నారు. కొందరి అధికారులపై చర్యలు తీసుకోవాలి, ఇకపై హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుడదని ఆశిస్తున్నామన్నారు.

అత్యంత హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో  చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్ లు బదలీ ఈసీ ఆదేశించారు. అదేవిధంగా గుంటూరు రూరల్ ఎస్పీ, తిరుపతి అర్బన్ ఎస్పి బదలీ కి ఈసీ ఆదేశించింది. మాచర్ల సర్కిల్ ఇన్ స్పెక్టర్ విధులను సమర్ధవంతంగా నిర్వహించనందున సస్పెన్షన్ కు ఈసి ఆదేశించింది.  డీఎస్పీ పలమనేరు, శ్రీకాళహస్తి లు,  సర్కిల్ ఇన్ స్పెక్టర్ లు పుంగనూరు, రాయ దుర్గం, తాడిపత్రి ల బదిలీ లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ ఆదేశించారు.

ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టే వ్యక్తిగత పథకాలకు నిషేధం వర్తిస్తుందని, ప్రభుత్వ దైనందిన కార్యక్రమాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపారు. కావాల్సిన చోట రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం స్పష్టత కూడా ఇస్తుందని చెప్పారు.  ఎన్నికల్లో పోటీ చేసిన వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గ్రామ వాలంటీర్లు తీరు మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారుల  మీదే ఉందని స్పష్టం చేశారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *