నిజానికి రెడ్డి కులానికి, కమ్మకులానికి మధ్య గొడవులు లేవు. ఆధిపత్య పోరు లేదు. ఇవి రెండూ ఆధిపత్య కులాలే. 83 వరకు రెడ్డి కులస్తులే ఎక్కువ గా అధికారంలో ఉన్నారు. వారికి కమ్మ కులస్తులు సంపూర్ణ సహకారం అందించారు..మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి…. ఎవరూ కమ్మ కులాన్ని వ్యతిరేకించలేదు. దానికి ముందే ముఖ్యమంత్రులైన నీలం సంజీవరెడ్డి,, కాసు బ్రహ్మానంద రెడ్డి….ఆ తర్వాత 90లలో ముఖ్యమంత్రి అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి…ఇలా ఎవరిని చూసుకున్నా….ఆన్ని కులాలను ఒకేలా చూశారు.. మరో ఆధిపత్య కులమైన కమ్మ కులాన్ని కూడా అలాగే చూశారు. కమ్మ కులస్తులు కూడా ఆయా ముఖ్యమంత్రులకు అలాగే సహకరించారు.
83 లో కమ్మ కులస్తుడైన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినా ఆయనకు అన్ని కులాలతో పాటు రెడ్డి కులస్తులు కూడా పూర్తి సహకారం అందించారు. ఎక్కడ కుల ప్రసక్తి రాలేదు.
కానీ, వినాశనం , అధికారం అనే ఆలోచన తప్ప మరొకటి లేని ఒకేఓక కుటుంబం పనిగట్టుకొని కమ్మ కులం మీద విషం చిమ్మటం మొదలు పెట్టింది. ఆ కుటుంబం మొదటి తరం అధికారంలోకీ వచ్చిన తర్వాత దాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. కమ్మ కులాన్ని వ్యతిరేకించటం ఆయనకు దగ్గరవటానికి ఒక సోపానం అనేలా పరిస్థితి తయారయ్యింది. ఆయన కూడా అలాగే చేరదీశాడు. కేవలం రెడ్డి కులస్తులనే కాకుండా, మిగతా కులాలు కూడా కమ్మ కులాన్ని వ్యతిరేకించేలా ప్రోత్సహించాడు. ఇక ఆ కుటుంబం రెండో తరం అధికారంలోకి వచ్చాక, ఆ వ్యతిరేకతను ద్వేషం స్థాయికి తీసుకెళ్ళాడు. ఆ ద్వేషాన్ని బహిరంగంగానే ప్రోత్సహించాడు. ఇప్పుడు ఏకంగా ఆయనే ప్రదర్శిస్తున్నాడు. ఆయన ఆదరణ పొందటం కోసం మిగతావాళ్ళందరూ రెడ్డి కులస్తులు కానివాళ్ళు కూడా కమ్మ కులాన్ని ద్వేషించటం , ఆ ద్వేషాన్ని ఆయన ప్రోత్సహించటం…దీనితో ఆంధ్రప్రదేశ్ ఒక కులాల కుంపటి లా తయారయింది.
ఇలా ఒకేఒక కుటుంబం రెడ్డి కులానికి,, కమ్మ కులానికి మధ్య చిచ్చు పెట్టింది. కేవలం ఆ కుటుంబం వల్లే శతాబ్దాలుగా కలిసున్న ఈ రెండు కులాలు ఒకరినొకరు ద్వేషించుకోనే స్థాయి కి వెళ్ళారు
ఇక్కడ దళిత కులాలను కూడా ఆ కుటుంబం ఎంత తెలివిగా వాడుకుంటుందో అర్థం చేసుకోవాలి.. దళితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు అనటంలో సందేహం లేదు. అందుకే ఆ కుటుంబం ఆధిపత్య కులానికి క్రైస్తవ ముసుగు వేసుకోని వారిని ఆకర్షించి వారిలో కూడా మరో ఆధిపత్య కులమైన కమ్మ కులం పట్ల ద్వేషాన్ని వారిలో పెంచుతుంది. ఇక్కడ దళితులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆధిపత్య కులాల పట్ల దళితుల ఆగ్రహం లో తప్పు లేదు. కానీ, ఒక ఆధిపత్య కులాన్ని మోస్తూ, మరో ఆధిపత్య కులాన్ని ద్వేషిస్తే అది దళితులకు ఎలా లాభం ?? దళితులకు అధికారం రావాలా అంటే ..ఖచ్చితంగా రావాలి..కానీ, మీ శక్తిని ఒక ఆధిపత్య కులాన్ని మోయటానికి, ఒక ఆధిపత్య కులాన్ని ద్వేషించటానికే పరిమితం అయితే మీరు కేవలం ఆయుధాలుగానే మిగిలిపోతారు. ఆ ఆయుధం ధరించిన ఒక ఆధిపత్య కులపోడు , మీ మీద అధికారం చెలాయిస్తూనే ఉంటాడు..మరి, మీకు పీడన పోయిందెక్కడ ?? దళితులను ఆయుధాలుగా వాడుకుంటూ, అప్పుడప్పుడు ఆయుధపూజ చేస్తే సంబరపడిపోతే దళితులు బాగుపడెదేలా ?
ఒక కుటుంబం, కేవలం ఒకే ఒక కుటుంబం ఒక పథకం ప్రకారం రెండు ఆధిపత్య కులాల మధ్య మంట పెట్టింది. సరిగ్గా గమనిస్తే ,ఇప్పుడు అదే కుటుంబం తమ పథకంలో రెండవ దశ అయిన ప్రాంతాల మధ్య చిచ్చు అనే దావానాలన్ని రాజేసింది. ఈ మంట పెరిగి.. పెరిగి… ఎన్ని జీవితాలు ఛిద్రం అవుతాయో …
—–mohan ravipati…………. 80742 32502——-