Breaking News

ఒక ఘనీభవించిన దృశ్యం

ananth

 

 

 

 కొన్ని దృశ్యాలు ఘనీభవిస్తాయి
కొన్ని దృశ్యాలు కరిగిపోతాయి 
కొన్ని దృశ్యాలు ఆవిరవుతాయి
ఘనీభవించినవన్నీ మనసులో ముద్రలుగా
కరిగిపోయినవన్నీ బుగ్గలపై కన్నీరుగా 
ఆవిరవయినవన్నీ వదిలేసిన గాలిగా …….”

 

ఈ రోజు అలాంటి మూడు దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి, నేనున్నాను అనే భరోసా ఘనీభవించితల్లిదండ్రి కోల్పోయిన భాద కరిగిపోయి తండ్రి నేరప్రవృత్తి ఆవిరయ్యి, మూడు దృశ్యాలు లక్ష్మీ ప్రసన్న కళ్ళముందు కనిపించాయి

మనసున్న మనుషులలో కూడా ఒక్కోసారి రాక్షసత్వం వస్తుంది, ఆ రాక్షసత్వం ముందు తాత్కాలికంగా ఒక్క క్షణం మానవత్వం వెనకడుగువేసినట్టు అనిపించవచ్చు. ఒక్కోసారి మానవత్వం మీద మనుషులకు నమ్మకం పోతుంది, సరిగ్గా ఆ సమయంలోనే మనకు మానవతావాదులు అవసరం . ఆ మానవతావాదులు మేమున్నాం అంటూ ముందుకొస్తారు. మానవత్వం మీద నమ్మకం కలిగిస్తారు. అలా కలిగించకపోతే మానవత్వం మాసిపోతుంది. నిజమైన సామాజికవేత్తలు ఇలాంటి మానవతావాదులు కావాలనే ఆశిస్తారు

సరిగ్గా, ఈ రోజు చంద్రబాబు గారు ఇదే పని చేశారు. లక్ష్మీ ప్రసన్న కు అండగా నిలిచారు. క్షణికావేశంలో ఉన్మాదిగా మారి, కర్కశంగా భార్యా పిల్లలను చంపి, మరుసటి రోజు తాను ఆత్మహత్య చేసుకున్న ఒక దురదృష్టవంతుడు, అతనికంటే దురదృష్టవంతురాలు ఆమె కూతురు. అంత దురదృష్టంలో కూడా అదృష్టం ఆ అమ్మాయి ఇంటికి దూరంగా ఉండి చదువుకోవటం. 
మొన్నటి వరకు ఉన్న తల్లి , తోబుట్టువులు మరుసటి రోజుకి లేరు, వారిని తన తండ్రే ఉన్మాదిగా మారి చంపాడు. ఇంజనీరింగ్ చదివే చిన్నారి తల్లి కి ఇది తట్టుకోలేనంత దెబ్బ. తల్లి కోప్పడితే తండ్రి ఒడిలోకి, తండ్రి కోప్పడితే తల్లి ఒడిలోకి వెళ్ళే పిల్లలకు, తన తండ్రే కాలయముడిలా మారి తన తల్లిని, తోబుట్టువులను చంపేశాడు అనే విషయం కనీసం మింగుడు కూడా పడదు., కనీసం ఎలా ప్రతిస్పందించాలో కూడా అర్ధం కాదు. ఎవరి భుజం ఆసరా దొరుకుతుందో తెలియదు, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు. ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు, అడుగుదాం అంటే తండ్రి ఎక్కడున్నాడొ తెలియదు, దీనికి తోడు పోలీసుల ప్రశ్నల పరంపర, ఒక్క నిమిషం ఆ చిట్టితల్లి పరిస్థితి ఆలోచించండి, ఆ అమ్మాయి మనసులో ఎక్కడో చిన్న ఆశ, ఆ హత్యలు చేసింది నాన్న కాకపోతే బాగుండు, కనీసం నాన్న భుజం మీద తల పెట్టి తనివితీరా ఏడుద్దాం అన్న చిన్న ఆలోచన, దురదృష్టం ఈ రోజు ఉదయానికి తండ్రి అత్మహత్య, మిణుకు మిణుకు మంటున్న చిన్న ఆశ కూడా ఆరిపోయింది, ఇప్పుడు తనివితీరా ఏడవాలి, కానీ ఎక్కడ !! ఎవరు అండగా ఉంటారు, ఎవరు ఆ భుజం ఇస్తారు, అసలు ఎవరిని నమ్మాలి !! మొత్తం చీకటి, మానసికంగా ఎంత నలిగిపోయుంటుందో ఆ చిట్టితల్లి, తలచుకుంటే గుండెల్లో నుండి దుఃఖం పొంగిపొర్లుతుంది.

అమ్మాయి స్టేజి మీద మాట్లాడిన మాటలు చూడండి ఎంత అమాయకంగా ఉన్నాయో, ఆ మాటల్లో మా నాన్న ఇదంతా ఎందుకు చేశాడొ తెలియటం లేదు, ఆయన మా నాన్న అని చెప్పుకోవాలంటేనే భాదేస్తుంది అంటూనే, నాన్న ని కడసారి చూడాలనుంది అని చెప్పిన ఆ అమ్మాయి ఆమాయకపు మొహం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది చంద్రబాబు లో ఉన్న తండ్రి మేలుకున్నాడు, ఒక్కసారిగా కదిలిపోయాడు, నిజమైన తండ్రి స్థానంలో ఉండి ఆలోచింఛాడు, ఆ అమ్మాయికి కావాల్సింది కేవలం ఆర్ధిక సహాయమే కాదు, దానికి మించిన ఒక తండ్రి స్థానం అని ఆ స్థానం నేనిస్తాను అని భరోసా ఇచ్చాడు, ముందుగా అ అమ్మాయిని దగ్గరుకు తీసుకొని దైర్యం చెప్పాడు. అమ్మాయి దుఃఖం తేటపడేవరకు అలాగే నుంచున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కి భవిష్యత్తు లో అండగా ఉంటానని చెప్పాడు

. ఆ మాట చెప్పిన తర్వాతే ఆ అమ్మాయి “ఈ వార్త విన్న తర్వాత అసలు నేను మాత్రం ఎందుకు బ్రతికుండాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ ఆలోచన నుండి బయటకు వచ్చాను “ అని చెప్పింది, అది బాబు ఇచ్చిన భరోసా, ఆ అమ్మాయి కి చదవుకి, ఉద్యోగానికి మాట ఇచ్చిన తర్వాతే ఆర్ధిక సహాయం మాట ఎత్తాడు. అది నిజంగా తండ్రి చేసే పని. చదువు, ఉద్యోగం, పెళ్ళి ఇవి తండ్రి భాధ్యతలు, ఆ మూడు భాద్యతలు తీరుస్తానని చెప్పాడు. తండ్రి ఎప్పుడూ ఈ వరస మిస్ కాడు, కేవలం సహాయమే చెయ్యాలనుకుంటే ఇరవై లక్షల కాకపోతే ముప్పై, యాభై లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు, కానీ, తండ్రి అలా చెయ్యడు, ముందుగా తగిలిన గాయానికి మందు పూశాడు. ఆ గాయం తాలూకు భాధ ను తట్టుకొనే ధైర్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ గాయాన్ని అధిగమించి కాళ్ళ మీద నిలబడే శక్తి కి నమ్మకం ఇచ్చాడు, ఆ తర్వాతే భవిష్యత్తు లో అమ్మాయికి కావాల్సిన సదుపాయాల గురించి చెప్పాడు . ఇక్కడ బాబులో నాకు ఒక సైక్రియాటిస్ట్ కనిపించాడు. మానసికంగా ఏదైనా కోలుకోలేని దెబ్బ తగిలినప్పుడు సైక్రియాటిస్ట్ లు అవలంబించే కౌన్సిలింగ్ విధానం ఇదే . అందుకే ఆ సన్నివేశం టివి సెట్లలో చూస్తున్నవారికి, ప్రత్యక్షంగా చూస్తున్న వారికి కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి.

బాబుగారూ !! ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న ఆంధ్రాప్రజలందరికీ కూతురు, మీరు ఇఛ్చిన భరోసా, మీరు చూపించిన చొరవ, మీరు ఆమెకు అండగా నిలిచిన తీరు, మీ మీద మా ప్రజలు పెట్టుకున్న విశ్వాసం తప్పు కాదు అని మరోసారి నిరూపించింది. మీరు కొన్ని లక్షలమంది హృదయాలలో తండ్రి స్థానాన్ని సంపాదించుకున్నారు

 

మోహన్.రావిపాటి

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *