Breaking News

కలలు నిజమాయె……………..

18839495_1693274590686125_76995182483828706_o

కొన్ని సహాయాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆ సహాయాలు జీవితాన్ని నిలబెట్టేస్తాయి. ఆ సహాయం చేసినవారిపట్ల జీవితాంతం కృతజ్ఞత ఉండేలా చేస్తాయి. అలాంటి కృతజ్ఞతలను ఆ సహాయం అందుకొనే సమయంలో వారి కళ్లల్లో చూడవచ్చు. ఈ రోజు నేను అలాంటి కొన్ని వేల కళ్ళను చూశాను. చంద్రబాబు ప్రభుత్వం పట్ల కృతజ్ఞత తో నిండిన కొన్ని వేల కళ్లను చూశాను

 

పై చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న ఉద్వేగం. అసలు అలాంటి చదువు ఒకటుందని కూడా తెలియని అమాయకపు తల్లిదండ్రులు. ఆ చదువుకు లక్షల్లో ఖర్చు అవుతుంది దానికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అంటే ఒక తెలియని సంభ్రమం అన్నీ కలిసి ఒక భావోద్వేగపు వాతావరణం

“నేను కార్ డ్రైవర్ ని సార్, నెలకో పదివేలు సంపాదిస్తా. మా అమ్మాయి బాగా తెల్వైన అమ్మాయి , కష్టపడి ఇంతర్మీడియట్ చదివించా. మా అమ్మాయి కి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలని కోరిక.నేను కనీసం ఆ కల కనే ధైర్యం కూడా చెయ్యలేదు సార్. మా ఆవిడ మాత్రం ఖుదా చల్లగా చూస్తే అవుతుంది అని ఆశపడుతుండేది. అలాంటిది ఇప్పుడు నా కూతురు డాక్తర్ చదవటానికి ఫిలిప్పైన్స్ వెళ్తుండి అంటే నాకు కళ్లవెంట నీళ్ళు వస్తున్నాయి సార్. ఖుదా ఉన్నాడు సాబ్. ఆయనే చంద్రబాబు కు చెప్పాడు సార్. చంద్రబాబు నూరేళ్ళు చల్లగా ఉండాలి సాబ్ ” అంటున్న అన్వర్ ఉద్వేగాన్ని చూస్తే నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి,

18768515_1693274450686139_7151060640289059306_o

వాళ్ల అమ్మాయిని , నీ అభిప్రాయం చెప్పమంటే ఆమె ఫైల్ తీసి చూపించింది . తెరిచి చూస్తే చనిపోయిన వాళ్ళ నాన్నమ్మ ఫొటో, దాని కింద చిరునవ్వుతో చంద్రబాబు ఫోటో. అది చాలు మాటలు మించిన కృతజ్ఞత . ఎమోషన్స్ కి మాటలు అవసరం లేదు

కోర్స్ అయ్యాక ఏమి చేస్తావమ్మా అంటే,” పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తాను సార్. నాకు పల్మనాలజీ చదవాలనుండి సార్ . మా ఊర్లో అందరూ సిగిరెట్లు, బీడీలు తాగే వాళ్ళే, మా నాన్న కూడా , వాళ్ళలో ఒక్కరిని బాగు చేసినా చాలు .దేవుడిచ్చిన జీవితానికి ఒక విలువ ఉన్నట్లే, ప్రభుత్వం నన్ను డాక్టర్ ని చేస్తుంది సార్, నేను ప్రభుత్వానికి కనీస సేవ అయినా చేస్తాను సార్..” అని చెప్తున్న అమ్మాయిని చూస్తే, అప్పుడు అనిపించింది నాకు నిజమైన సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇదే అని. ఒకరిని చదివించి ఒక ఊరిని ఆరోగ్యంగా ఉంచటం ఎంత గొప్ప కార్యక్రమం !!.

18891462_1693274484019469_5294602495280576304_o

 

అమ్మాయి కళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసం, కృతజ్ఞత తో కూడిన మెరుపు చూసి చెప్తున్నా, ఆ అమ్మాయి ఖచ్చితంగా మంచి డాక్టర్ అవుతుంది. రాయచోటి రాసి పెట్టుకో మరో, ఆరు – ఏడు సంవత్సరాలలో మీ ఊరికో మంచి డాక్టరమ్మ వస్తుంది

ఇలాంటి ఉద్వేగాలు , ఇదే స్థాయి కృతజ్ఞత అక్కడున్న ప్రతివారిలో కనిపించాయి. అగ్రికల్చర్ లొ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కోసం ఆస్ట్రేలియా . యం.టెక్ చెయ్యటం కోసం ఇంగ్లాండ్ వెళ్తున్న మరో అమ్మాయి. ఫిలిప్పైన్సే వెళ్తున్న మరో ముగ్గురు అబ్బాయలు. ఇద్దరు అమ్మాయలు. ఎవరైనా ఒక్కటే మాట. ప్రభుత్వం “చేసిన ఈ సహాయాన్ని మర్చిపోము . తప్పకుండా దానికి ప్రతి సహాయం చేస్తాం.”

వీళ్ళల్లో ఎవ్వరూ డబ్బున్నోళ్ళు కాదు. అందరూ దిగువ మధ్య తరగతి లేదా పేద తరగతి కి చెందిన వాళ్ళే. వీళ్ళకు మంచి జీవితాలిస్తే చాలు , వాళ్ళు సమాజం మొత్తాన్ని మార్చేస్తారు. వాళ్ళ చిరునవ్వులతో మనం ఖచ్చితంగా రేపు ఆనందకరమైన సమాజాన్ని చూస్తాం

ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎవరో ఒకరు గెలుస్తుంటారు, కానీ సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత తీసుకోగలిగేదే నిజమైన ప్రభుత్వం

18880061_1693275334019384_7246906193443792349_o

నేను ఖచ్చితంగా చెప్పగలను . 1996-2004 మధ్య ఇంజనీరింగ్ చదువులు, మధ్య తరగతి ప్రజల జీవన విధానాన్ని మార్చేస్తే, ఇప్పుడు దీని ద్వారా దిగువ మధ్య తరగతి, పేద వర్గాల జివీన విధానాన్ని మార్చేస్తుంది .

” కలలు నిజం చేసుకోండి, ఆనందకరమైన సమాజాన్ని నిర్మించండి”

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *