Breaking News

కశ్మీర్‌ నిర్ణయంపై స్పందించిన కమల్‌హాసన్‌

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎంఎన్‌ఎం పార్టీ అధినేత, సినీనటుడు కమల్‌హాసన్‌ ఖండించారు. ‘ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తిరోగమన, నిరంకుశమైన చర్య. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. ఆర్టికల్‌ 370, 35ఏ ప్రత్యేకమైనవి. వీటిలో ఏవైనా మార్పులు చేయాలంటే ముందుగా చర్చించి తర్వాత అమలు చేస్తే బాగుంటుంది’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పార్టీల నేతలు మోదీ సర్కార్‌ నిర్ణయాన్ని ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *