మచిలీపట్నం కృష్ణా:
పదవికే వన్నె తెచ్చిన కృష్ణా జిల్లా ఎస్పీ జనసేన పార్టీ అభినందనలు
కృష్ణాజిల్లా ఎస్పీగా రెండు సంవత్సరాలు జనం మెచ్చిన జిల్లా అధికారి గా రవీంద్ర బాబు అభినందనీయులని జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం అధికార ఇంచార్జి బండి రామకృష్ణ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కృష్ణా జిల్లా నుండి తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ అయిన ఎస్.పి రవీంద్ర బాబుని ఇన్చార్జ్ బండి రామకృష్ణ, అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ సన్మానించారు.
ఎన్నికలలో ఎంతో సమర్ధవంతంగా శాంతిభద్రతలు కాపాడుతూ, ప్రజల మన్ననలు పొందారని బండి రామకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా ప్రజలు రవీంద్రబాబు సేవలను ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటారు అని అన్నారు. 24 నెలలు జిల్లాలో శాంతి భద్రతలును కాపాడుతూ మంచి పేరు పొందాలని రామకృష్ణ అన్నారు.
జనసేన పార్టీ అధికార ప్రతినిధిలంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో చట్ట వ్యతిరేక చర్యలను ఉక్కు పాదం తో నియంత్రణ చేసి జిల్లా ప్రజల హృదయాలలో మంచి స్థానం సంపాదించిన పోలీస్ అధికారి రవీంద్ర బాబు అని అన్నారు. పదవికే వన్నె తెచ్చే విధంగా, పరిపాలనాదక్షతతో ఉత్తమ పోలీసు అధికారి గా రవీంద్ర బాబు కృష్ణాజిల్లాలో సేవలు అందించారన్నారు. కరోనా సమయంలో చేసిన సేవలు నిరుపమానం అని, జాతీయ స్థాయిలో కృష్ణాజిల్లాకు గుర్తింపు రావడానికి కారణమైన ఎస్ పి రవీంద్ర బాబు పోలీసు వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు అని బాలాజీ అన్నారు.
ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పన,సిబ్బందికి వైద్య సహాయం అందించి పోలీసు సిబ్బందితో ఎంతో నమ్మకంతో సేవలు అందించే విధంగా పరిపాలన చేయటంలో రవీంద్రబాబు గుర్తింపు పొందారని బాలాజీ అన్నారు