Breaking News

కోడెల చావుకి వైసీపీ వేధింపులే కారణం: గద్దె రామ్మోహన్‌

కోడెల చావుకి వైసీపీ వేధింపులే కారణమని టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌ ఆరోపించారు. కోడెలపై కేసులు పెట్టి ఆయనను మనోవేదనకు గురి చేసిందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తమలాంటి నాయకులకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండే వ్యక్తి కోడెల అని పేర్కొన్నారు. ఆయన మృతితో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని గద్దె రామ్మోహన్‌ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *