Breaking News

గట్టిగా మాట్లాడితే భయపడిపోతామని అనుకుంటున్నారు.కానీ. చంద్రబాబు

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో నీటి ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీళ్ల సమస్య కొన్ని సంవత్సరాలుగా నడుస్తోందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో నీళ్లపై టీడీపీ చేసిన పోరాటాన్ని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యులు అడ్డుతగలడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టిగా మాట్లాడితే తాము భయపడిపోతామని అనుకుంటున్నారని, వైసీపీ చర్యలు రాష్ట్రంలోని ఐదు కోట్ల మది ప్రజలు ఆలోచిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. సభలో తన నోరు మూయించవచ్చుగానీ, బయట మూయించలేరని అన్నారు. ఇది ఒక సున్నితమైన సమస్యఅని, భావితరాల భవిష్యత్తు తాకట్టుపెట్టే అధికారం ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *