Breaking News

గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వైయస్సార్ కంటి వెలుగు నేత్ర

గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వైయస్సార్ కంటి వెలుగు నేత్ర వైద్య చికిత్సల విభాగాన్ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు విభాగంలో అత్యాధునిక వైద్య పరికరాలతో, ప్రజానీకానికి అందించనున్న నేత్ర వైద్య చికిత్సల వివరాలను హాస్పిటల్ సూపరిండెంట్ ఇందిరా దేవి మీడియాకు వివరించారు. కార్పొరేట్ హాస్పిటల్ లో ఉండే అత్యాధునిక నేత్ర వైద్య,యంత్ర సామాగ్రితో ప్రభుత్వ హాస్పటల్ లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు వైద్య విభాగాన్ని గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శశిభూషణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను , ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ MV. నారాయణరెడ్డి, హాస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు మాదాసు వెంకట లక్ష్మి, నేత్ర వైద్య నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2021-11-24 at 2.02.09 AM (1)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *