గ్రామాల్లో పబ్లిక్ రేడియో!
* సాధ్యా సాధ్యాలు పరిశీలించండి
* ఆర్టీజీ, ఏపీ ఫైబర్ నెట్ అధికారులకు ముఖ్యమంత్రి సూచన
* ఈ-ప్రగతి పనులు వేగవంతం చేయాలి
* అత్యంత నివాసయోగ్య రాష్ట్రంగా ఏపీ
* ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి
* సాంకేతిక పరిఙానం అందుకు దోహదపడేలా చూడాలి
* అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం
సచివాలయం: గ్రామాల్లో ప్రజల మధ్య నరంతరం కమ్యూనికేషన్ బలోపేతం చేయడానికి వీలుగా ఆయా పల్లెలో ప్రజల మధ్య ఒక ప్రత్యేకమైన పబ్లిక్ రేడియో ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయేమో పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ సెంటర్లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్, ఈ-ప్రగతిలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మధ్య కమ్యూనియకేషన్ వ్యవస్థ మరింత బలోపేతం చేసి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా వారి మధ్య కమ్యూనికేషన్ ఉండేలా పల్లెల్లో ప్రత్యేకంగా పబ్లిక్ రేడియో ఏర్పాటు చేయడానికి అవకాశముంటుందేమో పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్, ఏపీ ఫైబర్ నెట్ అధికారులకు సూచించారు. అలా చేయడం వల్ల విపత్తులు, వాతారణ ప్రతికూలతలు ఏర్పడినా గ్రామీణుల మద్య కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అందుకు ఈ పబ్లిక్ రేడియో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. . ఈ-ప్రగతి కార్యక్రమాల ప్రగతిపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రగతి పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. డాటాను సమర్థవంతంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డాటా కలిగి ఉన్నవారే సంపన్నులని, డాటా అది పెద్ద సంపదన్నారు. భవిష్యతంతా నాలెడ్జ్ ఎకానమీదేనని, ప్రభుత్వ శాఖలు కూడా డాటాను సమర్థంగా వినియోగించుకుంటే అనూహ్య ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. సీఎం డ్యాష్ బోర్డులో ప్రజలకు రియల్ టైమ్లో మరిన్న వివరాలు తెలిసేలా దాన్ని ఆధునీకరించాలని అన్నారు.
అత్యంత నివాస యోగ్యంగా ఏపీ
దేశంలోని 10 అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో రాష్ట్రానకి చెందిన విజయవాడ,తిరుపతి నగరాలు స్థానం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్త చేశారు. విశాఖపట్నం కూడా ఈ జాబితాలో స్థానం పొందాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాలతో అవకాశం కోల్పోయిందన్నారు. అయితే ఇదే స్ఫూర్తిని తీసుకని దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్గా నిలపడానికి కృషి చేయాలని అధికారులను కోరారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. అందుకోసం సాంకేతికను సమర్థంగా వినియోగించాలన్నారు. సాంకేతికతతో ఆయా ప్రాంతాల్ల కాలుష్యం, వాయు కాలుష్య, ధ్వని కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని, అలాగే వీధి దీపాలు మొదలు, పారిశుద్ధ్యం వరకు సమర్థంగా పర్యవేక్షించగలమని అన్నారు. సాంకేతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసి వాటిని అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతాలుగా తీర్చి దిద్దాలని చెప్పారు. దీన్ని సాధించడానికి సంతోష సూచీలో ముందుకు వెళ్లడం కూడా ముఖ్యమని, దానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
డ్రోన్ల ద్వారా రహదారి గుంతల గుర్తింపు
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రహదారులపై ఉన్న గుంతలను గుర్తించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ ఫైబర్నెట్ ఎండీ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. మొత్తం 70 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులను డ్రోన్ల ద్వారా మ్యాపింగ్ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఫ్రీ వైఫై పాయింట్ల ఏర్పాటు పనులు కూడా వేగవంతగా జరుగుతన్నట్లు అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 4 వేల,గ్రామీణ ప్రాంతాల్లో 27,093 ఉచిత వైఫై పాయింట్లను గుర్తించామన్నారు. వర్చువల్ తరగతి గదులు ఏర్పాటు సెప్టెంబర్ నెలకల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నిర్దేశిత లక్ష్యాల మేరకు ఫైబర్ నెట్ పనులు పూర్తి చేయాలన్నారు. కంటెంట్ కార్పొరేషన్ కూడా పనలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు సాయిప్రసాద్, గిరిజా శంకర్, రాజమౌళి, ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈఓ బాబు, ఏ , సీఎం కార్యాలయ ఓఎస్డీ బాలాజీ ఆదివిష్ణు, ఐటీ సలహాదారు జే.సత్యనారాయణ, కంటెంట్ కార్పొరేషన్ సీఈఓ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు