Breaking News

చంద్రబాబు, పవన్‌పై బొత్స సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేనాని పవన్‌కల్యాన్ రాజకీయ బినామీ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే టీడీపీ వాయిస్‌ను పవన్‌ విన్పిస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణాలకు అదనంగా మూడురెట్లు ఖర్చవుతుందని, రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదని బొత్స భరోసా ఇచ్చారు. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని, అమరావతితో పాటు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్‌చేస్తామన్నారు. సీఎం జగన్‌ వంద రోజుల పాలనకు 100 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. ఏపీ రాజధానిని దనకొండకు తరలిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. దొనకొండా… అదెక్కడుందని మీడియాకు బొత్స ఎదురు ప్రశ్న వేశారు. వరల్డ్‌ బ్యాంక్ తనంతట తానే వెళ్లదని, ఏపీలో సంక్షేమానికి సాయం చేసేందుకు వరల్డ్‌ బ్యాంక్‌ ఇప్పటికీ సిద్ధంగా ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *