Breaking News

చదువులకు పుట్టినిల్లు మచిలీపట్నం

 

మచిలీపట్నం:

చదువులకు పుట్టినిల్లు మచిలీపట్నం…………… లేడీయంఫ్తుల్ ప్రిన్సిపాల్ రాకేష్ కుమార్

ఎందరో మేధావులు పుట్టిన మచిలీపట్నంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేయడం తన జీవితంలో మరిచిపోలేని రోజులు అని లేడీ యంఫ్తుల్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ రాకేష్ కుమార్ అన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ రాకేష్ కుమార్ మరియు ముగ్గురు అధ్యాపకులు బదిలీ అయిన సందర్భంగా శనివారం కళాశాల ప్రాంగణంలో కాలేజీ స్టాఫ్, అభివృద్ధి కమిటీ మరియు విద్యార్థునీలు ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మచిలీపట్నం నుండి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు డిగ్రీ కళాశాల కు బదిలీ అయిన ప్రిన్సిపాల్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా మచిలీపట్నంలో ప్రభుత్వ కళాశాలల్లో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. 51 సంవత్సరాల చరిత్ర కలిగిన లేడీ యంఫ్తుల్ కళాశాలలో మహిళలు విద్యకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం, వృత్తి విద్యా కోర్సులను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం అన్నారు.

తన పదవీ కాలంలో ప్రతిభ అవార్డులు రావడం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లు రావడం తనకు సంతోషదాయకం అన్నారు. కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శులు కొలుసు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కాలేజీలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఎంతగానో కృషి జరిగిందని అభివృద్ధి కమిటీ కాలేజీ కి అండగా ఉందని అన్నారు

కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ఈ కళాశాలలో గత ఆరు సంవత్సరాలుగా సేవలందించిన నలుగురు వివిధ ప్రాంతాలకు బదిలీ కావటం కాలేజీకి లోటు అయినా రాబోయే కొత్త ఉపాధ్యాయులతో వ్యక్తులతో కళాశాల ముందుకు వెళుతుందని అన్నారు. రాకేష్ కుమార్ ప్రిన్సిపాల్ గా పదవికే వన్నె తెచ్చే విధంగా పదవీ బాధ్యతలు నిర్వహించరన్నారు.

మరొ కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, అర్బన్ బ్యాంకు అధ్యక్షులు పల్లపోతుసుబ్రాహ్మణేశ్వ రావు మాట్లాడుతూ బదిలీ అయిన అధ్యాపకులు విద్యార్థినులతో చక్కటి స్నేహపూరితమైన వాతావరణం లో మంచి చదువును అందించారని అన్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో పేద విద్యార్థులకు చదువు అందించిన తృప్తి వెలకట్టలేనిది అన్నారు.

బాలికల కళాశాలలో గత ఐదు సంవత్సరాలుగా సేవలందించి తాడేపల్లిగూడెం, పెడన పామర్రు, ప్రభుత్వ కళాశాలలకు బదిలీ అయినా బి. రూప నాగశ్రీ, వి. సుందరలక్ష్మి,టి. నాగ భవాని మాట్లాడుతూ కళాశాలలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కళాశాల అనుభవాలను అధ్యాపకులు కన్నీటి పర్యంతం గా గా తెలియజేస్తూ మంచి కళాశాలను విడిచి వెళ్ళిపోతున్నావన్న బాధ మిగిలి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు WhatsApp Image 2021-10-09 at 12.33.23 AM (1) హరినాద్ బాబు, రేపల్లె రాంబాబు, జ్యోతి,పార్వతి మరియు ప్రసంగించారు. అనంతరం కళాశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ మరియు ముగ్గురు శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *