Breaking News

చిన్న ఉద్యోగి -గొప్ప ఔదార్యం !!

WhatsApp Image 2018-11-09 at 17.53.05 WhatsApp Image 2018-11-09 at 17.53.10

APSRTC

 

             11-10-18 తేదీన  బి.హెచ్.యి.ఎల్  నుండి  విజయవాడకు వస్తున్న ఏ.పి.ఎస్.ఆర్.టి.సి అమరావతి a/c బస్సు, సర్వీసు నంబరు-3568 లో  ఎక్కవలసిన ఒక ప్రయాణీకుడు  తాను  సమయానికి  చేరుకోకపోగా,   ఎంతోసేపు వేచి చూసి ఆలస్యంగా బయల్దేరిన డ్రైవరుకు ఫోన్ చేసి అసభ్యకరమైన పదజాలంతో బూతులు ఉపయోగించిన విషయంలో,  ఏ మాత్రం కోపగించుకోకుండా సంయమనం పాటించిన  డ్రైవరును  “మనుషుల్లో దేవునిగా”  సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్.వి.సురేంద్రబాబు, ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. ఈ ఘటన మొత్తాన్ని నిన్న(08.11.18న) ఎం.డి , నర్సరావుపేట డిపోలో జరిగిన పర్యటనలో, సిబ్బంది నుద్దేశించి ప్రసంగిస్తూ సదరు డ్రైవరును “మనుషుల్లో దేవుడు” అని అభివర్ణించారు. ఇలాంటి వారిని ఉద్యోగులు ఆదర్శంగా తీసుకుని పనిచేస్తే సంస్థ మరింత అభివృద్ద్ధి చెందుతుందని తెలిపారు.

            అయితే, ఈ కేసులో సదరు ప్రయాణీకుడు శ్రీ రత్తయ్య అసభ్యకరమైన భాష ప్రయోగించి డ్రైవరును బూతులు తిట్టినందుకు రూ.10,000/- మొత్తం సదరు డ్రైవరుకు పరిహారంగా చెల్లించేలా చర్యలు తీసుకోగా, అందుకు శ్రీ రత్తయ్య  అంగీకరించి తాను అసభ్యకరమైన భాష ప్రయోగించి నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు పరిహారంగా  ఆ మొత్తాన్ని డ్రైవరుకు చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తపరిచి, ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో అందచేశారు. వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్.వి. సురేంద్రబాబు, ఐ.పి.స్  ఈ రోజు అనగా 09-11-18న  తన చాంబర్ లో ఆ చెక్కును సదరు డ్రైవరుకు అందచేయడం జరిగింది.

            కాగా, తనవంటి చిన్న కార్మికుడికి గొప్ప అండగా నిలిచిన ఎం.డి. గారు  చూపిన చర్య పట్ల హృదయపూర్వకంగా స్పందించిన డ్రైవరు శ్రీ ఎన్. కుమార రాజు ఆ మొత్తాన్ని తాను పనిచేస్తున్న విజయవాడ డిపో వాటర్ ప్లాంట్ నిర్వహణ మరియు మరమ్మత్తులకు ఉపయోగించవలసిందిగా చెక్కును తిరిగి అప్పగించడం, అతని ఔదార్యాన్ని తెలియపరుస్తున్నది.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *