Breaking News

చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల లో గ్రామీణ క్రీడలు

అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామీణ క్రీడలైన రాతి గుండు ఎత్తడం. పెద్ద పెద్ద ఇనప రాడ్డు లను ఎత్తడం ( ఇరుసు) పోటీలను. చెన్నకేశవ స్వామి ఆలయం ముందు ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు పెద్దఎత్తున నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ క్రీడ నిర్వహణ అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి సౌజన్యంతో. వై ఎస్ ఆర్ సి పి యాడికి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు. ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ వారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరుసు ఎత్తె పోటీలో మొదటి బహుమతి మేకల రామచంద్రుడు యాడికి మూడవ వార్డు నెంబర్ గెలుపొందారు. ఇతనికి 10.000 రూపాయలు బహుమతి దాత గుంత తిరుపతి నాలుగో వార్డ్ నెంబర్ యాడికి. రెండవ బహుమతి గెలుచుకున్న వారు అగ్రహారం రాజా. మూడవ బహుమతి గెలుచుకున్న వారు బత్తలపల్లి మండలం అప్రా చెరువు గ్రామం పోతులయ్య..
అలాగే రాతి గుండు ఎత్తే పోటీల్లో మొదటి బహుమతి మనోహర్ యాదవ్ ఉలిందకొండ కర్నూలు జిల్లా వారు గెలుపొందారు. రెండో బహుమతి మాధవరం ఈశ్వర్ రెడ్డి గెలుపొందారు. మూడో బహుమతి గొందిపల్లె సురేష్. వీరందరికీ కి యాడికి మండలం వైఎస్ఆర్సిపి నాయకులు బొంబాయి రమేష్ నాయుడు చేతుల మీదుగా యాడికి ఉపసర్పంచ్ చంద్రమోహన్ తో పాటు గెలుపొందిన వారికి బహుమతులను దాతలు చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రాచీన క్రీడలు కావడంతో ఈ గ్రామ క్రీడలు ఆరోగ్యకరమైన దృఢమైన శరీరాకృతి కలిగి ఆనందంగా ఉండటానికి ఉపయోగపడే ఈ క్రీడలను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బొంబాయి రమేష్ నాయుడు మీడియాకు తెలిపారు.

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *