Breaking News

జగన్‌కు ముద్రగడ లేఖ.. దేనికోసమంటే

ముఖ్యమంత్రి జగన్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు కులానికి న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసిన కాపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని మా కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. కాపు జాతికి మీ ప్రభుత్వం న్యాయం చేయగలదని నమ్ముచున్నామన్నారు. ఆ విషయం గుర్తించి కాపులకు న్యాయం చేయాలని కోరారు. తాను లేఖలో రాసిన విషయాలు యదార్థమని నమ్మితేనే కాపు జాతికి ఉపకారం చేయాలని లేఖలో విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *