Breaking News

టిడిపి నాయకులు బయట తిరిగితే ప్యాలస్ పిల్లి కి వణుకు-నారా లోకేష్

కడప లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రెస్ మీట్…

 జగన్ రెడ్డి ది జంగిల్ రాజ్.
 ఏపీ లో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు.
 జగన్ రెడ్డి ప్యాలస్ పిల్లి.
 ప్యాలస్ పిల్లి కి టిడిపి నాయకుల్ని చూస్తే భయం.
 టిడిపి నాయకులు బయట తిరిగితే ప్యాలస్ పిల్లి కి వణుకు.
 టిడిపి కార్యకర్త ట్వీట్ పెడితే ప్యాలస్ పిల్లి కి తడిచిపోతుంది.
 ప్రజా సమస్యల పై పోరాడినా, ప్రశ్నించినా టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
 పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ మర్చిపోయారు… జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారు.
 జగన్ రెడ్డి పాలనలో రివర్స్ పోలీసింగ్ నడుస్తుంది. బాధితులపైనే కేసులు పెడతారు…అది జగన్ రెడ్డి రివర్స్ పోలీసింగ్ స్పెషల్.
 60 మంది ముఖ్యనాయకులు, 5 వేల మంది కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టారు. 70 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్ని హత్య చేసారు.
 వేల కోట్ల ఆస్తిని పేద ప్రజల కోసం దానం చేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు…అలాంటి వ్యక్తి పై అక్రమ కేసులు పెట్టి వేధించిన చెత్త ప్రభుత్వం ఇది.
 మా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు కాకినాడ లో ఒక పెళ్లి కి వెళితే ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.
 అసెంబ్లీ లో నిలదీస్తున్నారని మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
 ఇక అయ్యన్నపాత్రుడు మాట్లాడితే కేసు, నిలబడితే కేసు, కూర్చుంటే కేసు.
 చింతమనేని ప్రభాకర్ కారు ఎక్కితే కేసు…కారు దిగితే కేసు.
 ఇంకా విచిత్రం ఏంటంటే సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల లో నాగమ్మ అనే దళిత మహిళ ని చంపేస్తే కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టిడిపి ఎస్సి నాయకులు ఎంఎస్ రాజు, అనిత పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.
 వివేకా గారి కుటుంబానికి న్యాయం చెయ్యమని మాట్లాడినందుకు బిటెక్ రవి పై పెట్టిన కేసులకు లెక్కే లేదు. అంతర్జాతీయ టెర్రరిస్ట్ రేంజ్ లో రన్ వే పై అరెస్ట్ చేస్తారు.
 ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన తప్పేంటి? ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేసారు?
 ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడటమే ప్రవీణ్ చేసిన తప్పా?
 కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోరాడిన వ్యక్తి ప్రవీణ్ రెడ్డి.
 ప్రవీణ్ ఇంటి పై దాడి చేసింది వైసిపి రౌడీలు, రాళ్లు వేసింది వైసిపి రౌడీలు.
 పోలీసులు అరెస్ట్ చేసింది ప్రవీణ్ కుమార్ రెడ్డిని. బాధితుడ్ని అరెస్ట్ చేసారు.
 అందుకే ఏపీలో నడుస్తుంది రివర్స్ పోలీసింగ్ అంటున్నాను.
 ప్రవీణ్ కుమార్ రెడ్డి, టిడిపి నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి.
 ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పేరు రాచమల్లు ప్రసాద్ రెడ్డి కాదు రాచమల్లు బెట్టింగ్ రెడ్డి.
 నియోజకవర్గంలో భారీగా ఇసుక దోపిడీ చేస్తున్నారు.
 ప్రొద్దుటూరు కేంద్రంగా నడుస్తున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా కి రాచమల్లు బెట్టింగ్ రెడ్డి డాన్. బెట్టింగ్ దందా నిర్వహించే వాళ్ళ నుండి కోట్ల రూపాయిల షేర్ ఎమ్మెల్యే కి వెళ్తుంది
 బావమరిది బంగారురెడ్డి తో కలిసి భారీ దందాలు చేస్తున్నారు.
 దందాలు, సెటిల్ మెంట్లకు పోలీసులను వాడుకుంటున్నారు ఎమ్మెల్యే.
 ప్రొద్దుటూరులో రాచమల్లు బెట్టింగ్ రెడ్డి కలక్షన్ ఏజెంట్లుగా పెట్టుకున్న 9 మంది కానిస్టేబుళ్లను ఉన్నతాధికారుల బదిలీ చేస్తే వారే కావాలని రాష్ట్ర సచివాలయానికి వెళ్లి ఒత్తిడి చేసారు.
 రెండేళ్ల కిందట ప్రొద్దుటూరు టిడిపి నేత నందం సుబ్బయ్యను హత్య చేసిన కేసులో ఎమ్మెల్యే ఆయన బావమరిది పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు కేసు నమోదు చేయలేదు.
 భయం మా బయోడేటా లో లేదు…ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.
 రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేదు
 పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ఆయన బస చేస్తున్న హోటల్ లో సోదాలు, జన సేన కార్యకర్తల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను.
అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించిన ఘనత మాది
 పులివెందుల కి నీళ్ళు ఇచ్చింది టిడిపి
 జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మూడున్నర ఏళ్ళు అయ్యింది. సొంత జిల్లా కి చేసింది గుండు సున్నా.
 సొంత నియోజకవర్గంలో బస్ స్టాండ్ కట్టలేని వాడికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
 పులివెందుల లో ఉన్న బస్ స్టాండ్ ని ఆరు నెలల కిందట తొలగించారు. ప్రజల్ని చెట్ల కింద నిలబెట్టారు.
 ఏడాది కిందట కమలాపురం, జమ్మలమడుగు వద్ద రెండు వంతెనలు కూలిపోయినా ఇప్పటికీ పూర్తిచెయ్యలేదు. అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
 ఏడాది కిందట రాజంపేట మండలంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 40 మంది చనిపోయారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.. ఇల్లు కోల్పోయిన మూడు గ్రామాల ప్రజలకు ఇల్లు కట్టిస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికీ పునాదుల దశ దాటలేదు.
 కడప బుగ్గ వంకకు ఎప్పుడు వరద వచ్చినా కడప నగరం మునిగిపోయే ప్రమాద స్థితిలో ఉన్నా కనీసం సేఫ్టీ వాల్స్ నిర్మించడం లేదు. సీఎం మేనమామ ధియేటర్ తొలగించకుండా అలైన్మెంట్ మార్చే పనిలో బిజీగా ఉన్నారు.
 జమ్మలమడుగు వద్ద కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ రెడ్డి శంకుస్థాపన చేసి మూడేళ్లు అయ్యింది. అక్కడ శిలాఫలకం తప్ప ఏమి లేదు.
 వైఎస్. వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేసారు. జగన్ రెడ్డి గారి చెల్లెలు సునీతా రెడ్డి ఒంటరి గా పోరాడుతున్నారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసాడు. ఎలక్షన్ ముందు డ్రామా చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు బాబాయ్ హత్య గురించి మాట్లాడటం లేదు?
 రాజధాని పై మాట మార్చింది… మడమ తిప్పింది జగన్ రెడ్డి
 2014 ఏప్రిల్ 13 న మ్యానిఫెస్టో విడుదల చేస్తూ హైదరాబాద్ ని మించిన నగరం… వాషింగ్టన్ డిసి లాంటి నగరం కడతాం అని అన్నారు.
 ఎన్నికలు అయిన తరువాత 2014 జులై 23 న జగన్ రెడ్డి ఎం అన్నారు? రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలి కనీసం 30 వేల ఎకరాలు ఉండాలి అన్నారు.
 2014 సెప్టెంబర్ 4 న జగన్ రెడ్డి గారు అసెంబ్లీ లో ఎం అన్నారు? అమరావతి లో రాజధాని ని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అన్నారు. అంతే కాదు ఆయన మరో మాట కూడా అన్నారు చిన్న రాష్ట్రం అయ్యింది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మాకు ఇష్టం లేదు అని అన్నారు.
 జగన్ రెడ్డి గారి కోరిక మేరకే మేము అమరావతిని రాజధానిగా ప్రకటించాం.
 2017 జూలై 9 న ప్లినరీ లో అమరావతి వేదికగా చెబుతున్నా ఇక్కడే రాజధాని అన్నారు.
 2017 జూలై 19 న అమరావతిలో ఇళ్ళు కట్టుకున్నా, రైతులు ఆనంద పడేలా రాజధాని నిర్మిస్తా అన్నారు జగన్ రెడ్డి.
 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ రెడ్డి మాట మార్చారు.. మడమ తిప్పారు.
 అమరావతి పై అనేక ఆరోపణలు చేసారు. ఒక్కటి నిరూపించలేకపోయారు.
 అమరావతి వైట్ పేపర్. అక్కడ వైసిపి అక్రమాలు చెల్లవు. సీఆర్డీఏ చట్టం ఉంది.
 అందుకే ఉత్తరాంధ్ర ని దోచుకోవడానికి స్కెచ్ వేసారు.
 విజయసాయి రెడ్డి దస్పల్లా భూములు దోచుకుంటే. ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూర్మన్నపాలెం లో భూకబ్జా. మంత్రి ధర్మాన సైనికులకు చెందిన 71 ఎకరాలు కొట్టేసారు.
 విశాఖలో ఏమి మిగలలేదు. నిజమైన ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది విశాఖలో.
 భూములు, కొండలు, ఘనులు అన్ని వైసిపి నాయకులు మింగేశారు.
 40 వేలకోట్లు విలువ చేసే భూమి ఈ మూడున్నర ఏళ్లలో కొట్టేసారు.
 మాది నాడు- నేడు ఒకటే నినాదం. పరిపాలన ఒక చోట ఉండాలి…అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.
 విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన వివిధ సంస్థలను అన్ని జిల్లాలోనూ ఏర్పాటు చేసాం.
 రాయలసీమకి ఆటో మొబైల్, సోలార్, ఎలెక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం. విశాఖకి ఐటి కంపెనీలు తీసుకొచ్చాం.
 టిడిపి హయాంలో ఉత్తరాంధ్ర లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి 1600 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం 500 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
 రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదు.
అమరావతి రైతుల పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *