Breaking News

టీఆర్ఎస్‌పై రాహుల్ సీరియస్

రైతు సంఘర్షణ సభలో భాగంగా అధికార టీఆర్ఎస్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్కరి కోసమో ఏర్పడలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒకే ఒక్క కుటుంబం బాగు పడిందని విమర్శించారు. వేదిక మీద భర్తల్ని పోగొట్టుకున్న రైతు కుటుంబాలు ఉన్నాయని, ఇటువంటి బాధిత రైతులు రాష్ట్రమంతా ఉన్నారని ఆవేదన చెందారు. ఎంతో మంది త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడిందని అన్నారు. ఎందుకు తెలంగాణను రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నామో ఆ దిశగా తయారు కాలేదని, పరిస్థితి మొత్తం తారుమారైందని అన్నారు. ఈ పరిస్థితి కారణం ఎవరో ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనని తాను రాజు అనుకుంటున్నాడని, ఒక రాజులాగా ఫీలవుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *