Breaking News

టీడీపీని దెబ్బతీయాలనే కోడెలను టార్గెట్‌ చేశారు: గోరంట్ల

కోడెలతో తనకు 40 ఏళ్ల అనుబంధముందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. నేడు ఆయన కోడెల పార్థీవదేహానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. ఏ శాఖ తీసుకున్నా పూర్తి అవగాహనతో పనిచేశారని కొనియాడారు.

పల్నాడులో టీడీపీని దెబ్బతీయాలనే కోడెలను టార్గెట్‌ చేశారని విమర్శించారు. వైసీపీ ఇబ్బందికి గురిచేస్తోందని కోడెల తన ముందు ఏడ్చారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి వెల్లడించారు. కోడెలను మానసిక క్షోభకు గురిచేశారన్నారు. ఈడీ కేసులో జగన్‌ జైలు ఊచలు లెక్కించక తప్పదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *