Breaking News

డ్వాక్రా మహిళల ఆర్థిక వృద్ధి ప్రభుత్వ లక్ష్యం..

వైయస్సార్ ఆసరా 2 చెక్కులు పంపిణీ..

 

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..

మండపేట: స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.

స్థానిక సీతారామ కమ్యూనిటీ హాల్లో మంగళవారం వైయస్సార్ ఆసరా 2 చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి అధ్యక్షత వహించారు. శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. అలాగే పట్టణంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం 919 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 7,47,44000 కోట్ల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాజబాబు, కర్రి పాపారాయుడు, దూలం వెంకన్న బాబు, తేతలి వనజా రెడ్డి, ముమ్మిడివరపు బాపిరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *