Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి.. బీజేపీలోకి వెళ్తారన్న వార్తలపై

బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారంపై కాంగ్రెస్‌ నేత, ఎంపీ రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సోమవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీలో నాకు ఏం పనుంది. నరేంద్ర మోదీ ఉన్నారు కదా. ఆయన ఉన్నప్పు డు నన్ను తీసుకుంటే ప్రధానమంత్రిని చేయరు కదా. ఎందుకుపోతా బీజేపీలోకి. బుర్ర ఉండేవాడెవడైనా పోతాడా. ఇటువంటి బుర్రలేని చర్చలు వాళ్లు పెడుతుంటారు. ఆలాంటి బుర్రలేని ఆలోచనలు నేను చేయను.

ప్రశ్నించే గొంతుగా ప్రజలు నన్ను పార్లమెంటుకు పంపారు. ప్రజల తరఫున ప్రజా సమస్యలపై మాట్లాడమని, ప్రజల సమస్యలు వినిపించమని పార్లమెంటుకు పంపితే, అది వదిలేసి మరో పని చేస్తానని ఎందుకు అనుకుంటున్నారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి చిల్లర మల్లర ప్రచారాలు చే స్తే నమ్మకండి. ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తా’’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలన్న మొక్కు మేరకు మెట్లెక్కి వచ్చినట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *