Breaking News

తెలంగాణ సచివాలయంలోకి మీడియాకు నిషేధం

తెలంగాణ ప్రభుత్వం మీడియాపై ఉక్కపాదం మోపుతోంది. తెలంగాణ సచివాలయంలోకి మీడియాకు నిషేధించారు. దీంతో సీఎస్‌ ఎస్కే జోషిని కలిసి జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. మీడియాపై నిషేధం ప్రభుత్వ నిర్ణయమని, ఆపడానికి తానెవరిని, తాను ప్రభుత్వ సర్వెంట్‌ను మాత్రమేనని సీఎస్, జర్నలిస్టులకు బదులిచ్చారు. మూడు నెలల్లో రిటైర్‌ అయ్యేవాడినని, మీడియాను అనుమతించొద్దని ప్రభుత్వం చెప్పిందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ వాళ్లు ఓ స్టైల్‌లో నిరసనలు చేస్తున్నారని, మీ స్టైల్‌లో మీరు నిరసనలు చేసుకోండని జర్నలిస్టులకు జోషి చెప్పారు.

గతంలో కూడా కేసీఆర్ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు విధించారు. ‘ఈ మీడియా గోలేందయ్యా! కారెక్కుతుంటే కెమెరా పెడతారు, దిగుతుంటే పెడతారు. వాళ్లని ఎవరు రమ్మన్నారసలు. వీళ్లందరూ ఈడ (సచివాలయంలో) అవసరమా?’ అంటూ కేసీఆర్‌ మీడియాపై అసహనాన్ని వెళ్లగక్కారు. మీడియాకు స్వేచ్ఛ ఎక్కువైంది. అంత అవసరమా? సచివాలయంలో వాళ్లకేం పని?’’ అంటూ కేసీఆర్‌ కొంత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియా తన వైపు కెమెరాలు ఫోకస్‌ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *