Breaking News

తోట త్రిమూర్తులు ఎప్పటికైనా నాకు శత్రువే: ఏపీ డిప్యూటీ సీఎం

తోట త్రిమూర్తులుపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ఎప్పటికైనా తనకు శత్రువేనని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీలోకి ఎందరో వస్తుంటారు… పోతుంటారని అన్నారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో.. వైసీపీ ప్రభుత్వం దళితుల పక్షాన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైసీపీకి దళితులు అండగా ఉన్నారని, వారిని తాము వదులుకునే ప్రసక్తేలేదన్నారు. కేసులో ఏదైనా తేడా జరిగితే బాధితులను నేరుగా సీఎం దగ్గరికి తీసుకెళ్తానని, అవసరమైతే దళితులతో కలిసి ధర్నా చేసేందుకైనా తాను సిద్దమని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ స్పష్టం చేశారు.

కాగా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పి ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సమక్షంలో తోట త్రిమూర్తులు వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరికను పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *