Breaking News

నిపుణులు చెప్పినా జగన్ వినకుండా? చంద్రబాబు

సీఎం జగన్‌పై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధ్వంసక చర్యల వల్ల పోలవరం ఆగిపోయిందని ఆరోపించారు. గత ముఖ్యమంత్రులంతా తెలివిలేని వాళ్లా?, జగన్‌ పతివ్రత, హానెస్ట్‌ పర్సన్‌, నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టెండర్‌ షెడ్యూల్‌లో ఎందుకు మార్పులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల కల అని గుర్తుచేశారు. ఒకరిని దృష్టిలో పెట్టుకుని రీ టెండరింగ్ ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో పోలవరం ఆపేశారని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఇంత భారీ ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్‌కు పోలేదని తెలిపారు. సీఎం బంధువు పీటర్ ఇచ్చిన నివేదక ఆధారంగా ముందుకు పోతున్నారన్నారు. కేంద్రం చెప్పినా, నిపుణులు చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా ముందుకు పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో బోటు మునిగిపోతే ఇంత వరకూ కనిపెట్టలేని వాళ్లు పోలవరం రీటెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం కూడా పెరుగుతుందని నిపుణులు తేల్చారన్నారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగలదన్నారు. మా ఇంటికి నోటీస్ అంటించిన అంత సులువుగా …పోలవరం కట్టడం అనుకుంటున్నారని సెటైర్ వేశారు. సీఎంకి చేతకాకపోతే నిపుణులు చెప్పింది అయినా వినాలని విజ్ఞప్తి చేశారు. టెర్రరిస్ట్‌ ప్రభుత్వాన్ని చూసి మీడియా భయపడుతోందన్నారు. పీపీఏ, సీపీసీ గైడెన్స్‌ వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *